News March 29, 2025

అల్లూరి జిల్లాలో 99 మంది దూరం

image

అల్లూరి జిల్లాలో శుక్రవారం జరిగిన పదో తరగతి పరీక్షకు 99 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని DEO బ్రాహ్మజిరావు తెలిపారు. జిల్లాలో మొత్తం 71 పరీక్ష కేంద్రాల్లో 11,659 మంది విద్యార్థులు బయాలజికల్ సైన్స్ రాయవలసి ఉండగా 11,560 మంది రాసారని, 99.15 శాతం హాజరు అయ్యారని తెలిపారు. హుకుంపేట, పాడేరు మండలాల్లో 4 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.

Similar News

News April 2, 2025

విజయవాడలో మహిళ అనుమానాస్పద మృతి

image

విజయవాడ ఆటో నగర్‌లో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. లక్ష్మి, మహంకాళి దంపతులు చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవిస్తున్నారు. లక్మికి మహంకాలి నాలుగో భర్త. చిత్తు కాగితాలు ఏరగా వచ్చిన డబ్బుతో మద్యం తాగుతుంటారు. మంగళవారం లక్ష్మి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే భర్త మహంకాళి పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.

News April 2, 2025

బిగ్ బాస్‌లో ఛాన్స్ ఇవ్వాలని ఆర్టిస్ట్ నిరసన

image

బిగ్ బాస్ సీజన్ 9లో అవకాశం కల్పించాలంటూ ఓ సినీ ఆర్టిస్ట్ నిరాహార దీక్ష చేసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. అన్నపూర్ణ స్టూడియో సమీపంలో మిర్యాలగూడకు చెందిన రామాచారి అనే నటుడు తాను కూలీ బిడ్డనని, తనకు బిగ్ బాస్ సీజన్ 9లో అవకాశం కల్పించాలంటూ నిరాహార దీక్ష చేశాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు రామాచారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

News April 2, 2025

బర్డ్ ఫ్లూతో చిన్నారి మృతి.. రాష్ట్రంలో తొలి కేసు

image

AP: పచ్చిమాంసం తిన్న 2ఏళ్ల బాలిక బర్డ్ ఫ్లూతో చనిపోయిన ఘటన పల్నాడు (D) నరసరావుపేటలో జరిగింది. రాష్ట్రంలో ఈ వైరస్‌తో మనుషులు మరణించడం ఇదే తొలిసారి. అనారోగ్యంతో ఉన్న బాలికను మార్చి 4న మంగళగిరి ఎయిమ్స్‌కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ 16న మృతిచెందింది. పాప స్వాబ్ నమూనాలను పరీక్షించగా బర్డ్ ఫ్లూగా తేలింది. కోడిని కోసేటప్పుడు అడగ్గా ఓ ముక్క ఇచ్చామని, అది తిన్న చిన్నారి జబ్బు పడిందని పేరెంట్స్ చెప్పారు.

error: Content is protected !!