News March 20, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

>రాజవొమ్మంగి: పెరిగిన పొగాకు పంట సాగు
>పాడేరు: నాటుసారా నిర్మూలనే నవోదయం 2.0 లక్ష్యం
>మారేడిమిల్లి: రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి
>అనంతగిరి: చందాలెత్తుకుని మట్టి రోడ్డు నిర్మాణం
>డుంబ్రిగుడ: అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన
>రంప: 300మందికి పవర్ స్ప్రేయర్లు పంపిణీ
>అల్లూరి జిల్లా ఎమ్మెల్యేలపై స్పీకర్ ఆగ్రహం
>పాడేరు: వ్యాన్‌ను ఢీకొని యువకుడు మృతి
Similar News
News March 28, 2025
చరిత్ర సృష్టించిన నొవాక్ జకోవిచ్

దిగ్గజ టెన్నిస్ క్రీడాకారుడు నొవాక్ జకోవిచ్ మియామీ ఓపెన్‌లో చరిత్ర సృష్టించారు. అమెరికాకు చెందిన సెబాస్టియన్ కోర్డాపై 6-3, 7-6 (7/4) తేడాతో గెలుపొందారు. ఈక్రమంలో టోర్నీ చరిత్రలో సెమీస్‌కు చేరిన అతి పెద్ద వయస్కుడిగా రికార్డులకెక్కారు. ఈరోజు జరిగే సెమీస్‌లో బల్గేరియాకు చెందిన గ్రిగోర్ దిమిత్రోవ్‌తో ఆయన తలపడనున్నారు.
News March 28, 2025
ఏలూరు : రైలు కింద పడి వ్యక్తి మృతి

గుర్తుతెలియని వృద్ధుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏలూరు నగరంలోని ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం నంబర్ – 2 సమీపంలో శుక్రవారం జరిగింది. సమాచారమందుకున్న రైల్వే ఎస్సై సైమన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతునికి 60 – 65 ఏళ్లు ఉంటాయని తెలిపారు . వివరాలు తెలిసిన వారు సంప్రదించాలని ఆయన సూచించారు.
News March 28, 2025
సీఎం అంటే మర్యాద లేదా?.. స్టాలిన్ ఆగ్రహం

తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్షంపై సీఎం స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపరిస్థితులపై చర్చకు AIADMK వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టగా స్పీకర్ తిరస్కరించారు. వారు పట్టుబట్టడంతో అధికార పక్షం వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో ప్రతిపక్ష సభ్యుల్ని స్పీకర్ సస్పెండ్ చేశారు. అనంతరం ప్రతిపక్షంపై CM మండిపడ్డారు. ‘CM అనే మర్యాద కూడా లేదా? వేలు చూపిస్తూ ఏకవచనంతో మాట్లాడటమేంటి?’ అని ప్రశ్నించారు.