News March 16, 2025

అల్లూరి: పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు

image

అల్లూరి జిల్లాలో సోమవారం నుంచి నిర్వహించనున్న పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు DEO బ్రహ్మాజీరావు ఆదివారం తెలిపారు. అడ్డతీగల, అనంతగిరి, శివలింగంపురం, కొత్త బల్లుగూడ, చింతపల్లి, మోతుగూడెం, దేవీపట్నం, డుంబ్రిగూడ, జి. మాడుగుల, గూడెం, సీలేరు, బాకూరు, కూనవరం, నరసింగపేట, బోదులూరు, జోలాపుట్, సింగంపల్లి, గౌరీదేవిపేట, ఎస్‌విగూడెం, వై రామవరంలో కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు.

Similar News

News March 17, 2025

డీఎంకే లక్ష్యంగా బీజేపీ ఆందోళనలు

image

తమిళనాడులో డీఎంకే సర్కార్ టార్గెట్‌గా బీజేపీ ఆందోళనలకు దిగింది. మద్యం దుకాణాల ముట్టడికి బీజేపీ పిలుపునివ్వగా పార్టీ చీఫ్ అన్నామలై సహా కీలక నేతలు హౌస్ అరెస్టయ్యారు. లిక్కర్ అమ్మకాల ద్వారా డీఎంకేకు రూ.1000 కోట్లు ముట్టాయని బీజేపీ ఆరోపణలకు పాల్పడుతోంది. రూపీ(₹) సింబల్ పేరుతో డీఎంకే నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

News March 17, 2025

అమెరికాలో ప్రమాదం.. రంగారెడ్డి జిల్లా వాసులు మృతి

image

అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా వాసులు చనిపోయారు. కొందుర్గు మండలంలోని టేకులపల్లికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కూతురు ప్రగతిరెడ్డి(35), మనవడు హార్వీన్ (6), సునీత (56) మృతి చెందారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు అమెరికాలో మృతి చెందడం పట్ల టేకులపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News March 17, 2025

RECORD: FY25లో ₹1.75 లక్షల కోట్ల ఫోన్లు ఎగుమతి

image

భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. FY25 తొలి 11 నెలల్లోనే రూ.1.75లక్షల కోట్ల ($21B) విలువైన మొబైల్ ఫోన్లను ఎగుమతి చేసింది. IT మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ అంచనా వేసిన $20Bతో పోలిస్తే ఇది ఎక్కువే. FY24లో ఎగుమతి చేసిన $15.6Bతో చూస్తే ఏకంగా 54% ఎక్కువ. భారత్ నుంచి అమెరికా, బ్రిటన్, UAE, నెదర్లాండ్స్‌కు యాపిల్, శామ్‌సంగ్ మొబైళ్లు ఎగుమతి అవుతున్నాయి. అందులో USకే 50% కన్నా ఎక్కువ వెళ్తున్నాయి.

error: Content is protected !!