News March 14, 2025
అల్లూరి: మహిళా టీచర్లు మాత్రమే అర్హులు

సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్ట్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టును భర్తీ చేయడానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అదనపు సమన్వయకర్త స్వామి నాయుడు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ జడ్పి ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మహిళ టీచర్లు అర్హులన్నారు. ఈనెల 13 నుంచి 19 వరకు దరఖాస్తులు తమ కార్యాలయంలో స్వీకరిస్తున్నట్లు చెప్పారు.
Similar News
News March 15, 2025
గోదావరిఖని: ఆటో ట్రాలీ బోల్తా.. పలువురికి గాయాలు

ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్ఎఫ్ సీఎఫ్ టౌన్ షిప్‌లో గెస్ట్ హౌస్ మూల మలుపు వద్ద శనివారం ట్రాలీ ఆటో అతివేగంగా నడపడంతో అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన బాధితులను 108 వాహనంలో గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 15, 2025
విశాఖ జూలో వరుస మరణాలు..!

విశాఖ జూపార్క్‌లో వన్యప్రాణుల వరుస మరణాలు జంతు ప్రేమికులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే గతంలో అరుదైన జత జిరాఫీలు, ఒక జీబ్రా, నీటి ఏనుగు మృత్యువాత పడ్డాయి. తాజాగా కొన్ని రోజుల క్రితం ఆసియాటిక్ లయన్‌కు పుట్టిన రెండు సింహపు కూనలు ప్రాణాలు విడిచాయి. గురువారం అనారోగ్యంతో 20 ఏళ్ల చిరుత పులి ప్రాణాలు విడిచింది. ప్రభుత్వం,అధికారులు దృష్టి పెట్టి వన్యప్రాణులను కాపాడాలని సందర్శకులు కోరుతున్నారు.
News March 15, 2025
నా చివరి రక్తపు బొట్టువరకూ ప్రజలకు సేవ చేస్తాను: సీఎం చంద్రబాబు

AP: తన జీవితం ప్రజల కోసం అంకితమని తణుకు పర్యటనలో CM చంద్రబాబు తెలిపారు. ‘41 ఏళ్లుగా అసెంబ్లీకి వెళ్తున్నాను. పదేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేశాను. నా జీవితమంతా అలుపెరుగని పోరాటమే. నా చివరి రక్తపు బొట్టు వరకు మీకు సేవ చేయాలనేదే నా సంకల్పం. ఇప్పటి వరకు చేసినదానికి రెట్టింపు పనిని వచ్చే 5, 10 ఏళ్లలో చేస్తాను. వచ్చే 22 ఏళ్లలో మన రాష్ట్రాన్ని దేశంలో నంబర్ వన్‌గా చేస్తాను’ అని వ్యాఖ్యానించారు.