News February 25, 2025
అల్లూరి: రెండు రోజులు లిక్కర్ షాపులు బంద్

అల్లూరి జిల్లాలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అధికారులు మద్యం దుకాణాలు మంగళవారం సాయంత్రం నుంచి మూసి వేయించారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చారు. ఫిబ్రవరి 25 సాయంత్రం 4 గంటల నుంచి 48 గంటలపాటు లిక్కర్ షాపులు మూసివేయాలని దుకాణదారులను అధికారులు ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎటువంటి మద్యం దుకాణాలు నిర్వహించరాదని హెచ్చరించారు.
Similar News
News February 26, 2025
బ్రహ్మ, విష్ణువు మధ్య వివాదం.. శివుడు ఏం చేశాడంటే?

విష్ణువు, బ్రహ్మ మధ్య ఎవరుగొప్ప అనే వివాదం తలెత్తుతుంది. అప్పుడు శివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి, లింగానికి ఆది, అంతాలను కనిపెట్టిన వారే గొప్పవారని చెబుతాడు. విష్ణువు మహాలింగం మూలం కనుగొనేందుకు ప్రయత్నిస్తాడు. బ్రహ్మ ఆది తెలుసుకోవాలని చూసి విఫలమవుతాడు. అయితే తాను ఆది కనుగొన్నట్లు మొగలిపువ్వు, గోవుతో శివుడికి అబద్ధపు సాక్ష్యం చెప్పిస్తాడు. అది తెలిసి బ్రహ్మ, మొగలిపువ్వు, గోవును శివుడు శపిస్తాడు.
News February 26, 2025
జనగామ: అన్ని పాఠశాలలకు జిల్లా అధికారి ఆదేశాలు

ఈనెల 28న జనగామ జిల్లాలోని అన్ని పాఠశాలల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించాలని జిల్లా సైన్స్ అధికారి ఉపేందర్ మంగళవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. సైన్స్ ప్రాముఖ్యతను తెలిపేలా వివిధ రకాల పోటీలను నిర్వహించాలని ప్రకటనలో పేర్కొన్నారు. పాఠశాల స్థాయిలో గెలుపొందిన విద్యార్థులకు పేరెంట్స్ కమిటీ ప్రోత్సాహంతో బహుమతులు అందజేయాలని సూచించారు. వివరాలకు 9441453662 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
News February 26, 2025
కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు 5 రోజులు సెలవులు..

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు నేటి నుంచి మార్చి 2వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ ఛైర్మన్ గంట సంజీవరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 26 శివరాత్రి, 27 మహాశివరాత్రి జాగరణ, 28 అమావాస్య, 1 వారాంతపు సెలవు, 2 ఆదివారం వారాంతపు సెలవు ఇస్తున్నట్లు తెలిపారు. కావున రైతులు గమనించాలని కోరారు.