News March 28, 2024

అవనిగడ్డ ఒక్కటే మిగిలింది.!

image

కైకలూరు, విజయవాడ వెస్ట్ NDA అభ్యర్థులను నిన్న ప్రకటించారు. దీంతో ఉమ్మడి కృష్ణాలోని 16 సీట్లలో 15 మంది అభ్యర్థులెవరో తెలిసిపోయింది. జనసేనకు కేటాయించిన అవనిగడ్డ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. వంగవీటి రాధ, విక్కుర్తి శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నా ఫైనల్ కాలేదు. మరోవైపు మండలి బుద్ధప్రసాద్ వర్గం TDPకే టికెట్ ఇవ్వాలని నిరసన తెలుపుతోంది. ఈ క్రమంలో అవనిగడ్డ టికెట్ ఎవరికిస్తారనే ఉత్కంఠ కొనసాగుతోంది.

Similar News

News December 28, 2024

విజయవాడలో రామ్ చరణ్ 256 అడుగుల కటౌట్

image

విజయవాడలో రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 256 అడుగుల ఎత్తుతో గేమ్ ఛేంజర్ కటౌట్ నిర్మించారు. ఈ కటౌట్ ను రేపు మధ్యాహ్నం 3 గంటల సమయంలో గేమ్ చేజింగ్ మూవీ టీం హాజరై ఆవిష్కరించనున్నారు. కటౌట్ ఆవిష్కరణ అనంతరం హెలికాప్టర్‌తో పూల వర్షం కురిపించేందుకు ఏర్పాటు చేసినట్లు సమాచారం. తమ అభిమాన కథానాయకుడు భారీ కటౌట్ ఏర్పాటు చేయటం పట్ల ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News December 28, 2024

విజయవాడ: 1400 మంది యువతకు ఉద్యోగాలు

image

అర్హులైన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు లభించాయని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. శనివారం విజయవాడలో నిర్వహించిన మెగా వికసిత్ జాబ్ మేళా కార్యక్రమానికి సుమారు 5000 మంది అభ్యర్థులు హాజరయ్యారన్నారు. ఈ జాబ్ మేళాలో 1400 మంది నిరుద్యోగులకు ఐటీ ఉద్యోగాలతో పాటు ఇతర ఉపాధి అవకాశాలు లభించాయని తెలిపారు. అనంతరం ఉద్యోగం సాధించిన యువతకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.

News December 28, 2024

తెలుగును చిన్నచూపు చూస్తున్నారు: ఎన్వీ రమణ

image

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నేటివరకు తెలుగుభాషా అభివృద్ధికి ఏ ప్రభుత్వం పనిచేయలేదని సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. విజయవాడ కేబిఎన్‌లో జరుగుతున్న తెలుగు రచయితల మహాసభలో శనివారం ఆయన మాట్లాడారు. ఇతర దేశాలు, రాష్ట్రాలు ప్రాంతీయ భాషకు ప్రాధాన్యత ఇస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం పరాయి భాషకు పట్టం కడుతున్నారన్నారు. ఆంగ్లం ద్వారానే ఉద్యోగాలు వస్తాయన్న అపోహలో ఉన్నారన్నారు.