News January 26, 2025
అవార్డు అందుకున్న అల్లూరి జిల్లా కలెక్టర్

అల్లూరి జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేశ్ కుమార్ బెస్ట్ ఎలెక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డ్ అందుకున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విజయానంద్ చేతుల మీదుగా శనివారం ఈ అవార్డు తీసుకున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన జాతీయ ఓటర్ల దినోత్సవం వేడుకలలో ఈ అవార్డును ప్రదానం చేశారు. గతేడాది ఓటర్ల జాబితా తయారీలో, సమ్మరీ రివిజన్‌లో విశేష కృషి చేసినందుకు కలెక్టర్‌కు ఈ అవార్డు వరించింది.
Similar News
News March 14, 2025
హనుమకొండ: ఈ నెల 15 నుంచి ఏఐ విద్య బోధన: యోగితా రాణా

ఈ నెల 15వ తేదీ నుంచి జిల్లాలలో ఎంపిక చేసిన ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలల్లో కృత్రిమ మేధ ఏఐను వినియోగిస్తూ సులభతరంగా విద్యాబోధన చేసేందుకు చర్యలు చేపట్టాలని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా విద్యా బోధనపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
News March 14, 2025
స్టాలిన్ ప్రభుత్వంపై నిర్మల సీతారామన్ ఫైర్

తమిళనాడు బడ్జెట్ పత్రాల్లో <<15745743>>రూపీ(₹) గుర్తును<<>> తొలగించి రూ. అనే అక్షరాన్ని చేర్చడంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫైరయ్యారు. 2010లో కేంద్రం రూపీ సింబల్‌ను ఆమోదించిన సమయంలో ఎందుకు వ్యతిరేకించలేదని స్టాలిన్ సర్కారును ప్రశ్నించారు. ఇప్పుడు ఈ గుర్తును తిరస్కరించి తమిళ యువత సృజనాత్మకతను విస్మరించారని మండిపడ్డారు. కాగా రూపీ(₹) గుర్తును డిజైన్ చేసింది డీఎంకే నేత కుమారుడు ఉదయ కుమార్ కావడం గమనార్హం.
News March 14, 2025
వైసీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా మల్లయ్య యాదవ్

వైసీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా మల్లయ్య యాదవ్ ఎంపికయ్యారు. గుత్తి మండలం బేతపల్లికి చెందిన వైసీపీ నేతలు సూర్యనారాయణ, ఈశ్వరయ్య, తదితరులు మల్లయ్య యాదవ్‌ను ఆయన నివాసంలో కలిశారు. ముందుగా మల్లయ్యను శాలువాతో సత్కరించి, పూలమాల వేసి సన్మానించారు. రైతుల సమస్యల పట్ల పోరాడుతానన్నారు. తనను ఎంపిక చేసినందుకు వైఎస్ జగన్, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వైవీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.