News July 3, 2024

అవాస్తవాలను నమ్మవద్దు: TTD

image

శ్రీవారి ఆలయంలో అన్నప్రసాదాల తయారీలో మార్పులు చేశారని, దిట్టం పెంచారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై TTD స్పందించింది. ‘ఇది పూర్తిగా అవాస్తవం. ఇటువంటి వార్తలు నమ్మవద్దు. ఈవో శ్యామలారావు మొన్న అర్చకస్వాములు, ఆలయ అధికారులతో సమావేశమయ్యారు. స్వామివారికి నివేదించే అన్న ప్రసాదాలపై చర్చించారు. కానీ ఎలాంటి కొత్త నిర్ణయం తీసుకోలేదు’ అని TTD స్పష్టం చేసింది.

Similar News

News December 21, 2024

బైరెడ్డిపల్లి: డెంగ్యూతో విద్యార్థిని మృతి

image

బైరెడ్డిపల్లి మండలం ఓటేరిపాలెం గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని డెంగ్యూ జ్వరంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గుణశేఖర్ కుమార్తె రక్షిత 6వ తరగతి చదువుతోంది. పది రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఎంతకీ జ్వరం తగ్గకపోవడంతో తిరుపతి రుయాకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు కుటుంబీకులు పేర్కొన్నారు.

News December 21, 2024

జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన పెద్దిరెడ్డి 

image

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాజీ మంత్రి, పుంగనూరు MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుభాకాంక్షలు చెప్పారు. శనివారం బెంగళూరులోని జగన్ నివాసానికి చేరకున్న పెద్దిరెడ్డి బొకే అందించి సన్మానించారు. తమ నాయకుడు ఇలాంటి వేడుకలు మరెన్నో చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పెద్దిరెడ్డి తెలిపారు. కాగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా జగన్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ కార్యకర్తలు వైభవంగా నిర్వహిస్తున్నారు.

News December 21, 2024

రామసముద్రం: హౌసింగ్ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి

image

రామసముద్రం మండలం చెంబకూరు పంచాయతీలోని హౌసింగ్ లేఔట్ ను శనివారం హౌసింగ్ డిఈ రమేష్ రెడ్డి, ఎంపీడీవో భానుప్రసాద్ పరిశీలించారు. పెండింగులో ఉన్న గృహనిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని డీఈ సూచించారు. పునాదులు, గోడల వరకు ఉన్న ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసినట్లయితే వెంటనే బిల్లులు లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయడం జరుగుతుందన్నారు.