News February 24, 2025

అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో సిక్కోలు ఎమ్మెల్యేలు

image

శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో శ్రీకాకుళం జిల్లాలోని నియోజకవర్గాలకు చెందిన శాసనసభ్యులు కింజ‌రాపు అచ్చెన్నాయుడు, గొండు శంకర్, గౌతు శిరీష, బగ్గు రమణమూర్తి, నడుకుదిటి ఈశ్వరరావు, మామిడి గోవిందరావు, బెందాళం అశోక్, కూన రవికుమార్ హాజరయ్యారు. నియోజకవర్గంలోని సమస్యలపై రేపటి నుంచి సభలో గళం వినిపించడానికి సిద్ధమయ్యారు.

Similar News

News April 23, 2025

టెన్త్ ఫలితాల్లో అదరగొట్టిన సిక్కోలు ఆణిముత్యాలు

image

నేడు విడుదలైన SSC ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రతిభ చూపారు. 550 దాటిన మార్కుల్లో అమ్మాయిలదే పైచేయి. లావేరుకు చెందిన హరిత 600కి 592 మార్కులు వచ్చాయి. పలు మండలాల్లో ఫలితాల వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్ ఎన్ పేట- 569( జాహ్నవి) , టెక్కలి- 577( లావణ్య), లావేరు-578( కుసుమ శ్రీ), రణస్థలం – 590(ఝాన్సీ) పది ఫలితాల్లో అదరగొట్టారు.

News April 23, 2025

SKLM: గ్రామదేవతల సిరిమాను ఉత్సవంపై సమీక్ష

image

అన్ని శాఖల సమన్వయంతో శ్రీ గ్రామదేవతల సిరిమాను ఉత్సవం ఏర్పాట్లపై దృష్టి సారించాలని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర రావు అన్నారు. బుధవారం కలెక్టరెట్ మందిరంలో గ్రామదేవతల సిరిమాను ఉత్సవం ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. సమన్వయంతో విధులు నిర్వహించి పండగ ఒక మంచి వాతావరణంలో జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. 

News April 23, 2025

శ్రీకాకుళంలో ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థి సూసైడ్

image

ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో మార్కులు త‌క్కువ‌గా వచ్చాయని శ్రీ‌కాకుళానికి చెందిన విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌కు పాల్పడ్డాడు.  బ‌ల‌గ ప్రాంతానికి చెందిన గురుగుబిల్లి వేణుగోపాల‌రావుకు బుధ‌వారం విడుద‌లైన ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్షా ఫ‌లితాల్లో 393 మార్కులు వచ్చాయి. త‌క్కువ రావడంతో మ‌న‌స్థాపానికి గురై ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.

error: Content is protected !!