News November 12, 2024

అసెంబ్లీ విప్‌లుగా బోండా ఉమ, యార్లగడ్డ, తంగిరాల సౌమ్య

image

శాసన సభ, శాసనమండలి చీఫ్ విప్, విప్‌లను కాసేపటి క్రితం ప్రభుత్వం ఖరారు చేసింది. ఇద్దరు చీఫ్ విప్‌లతో పాటు 15 మందిని విప్‌లుగా నియమించింది. శాసన సభ చీఫ్ విప్‌గా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, శాసన మండలి చీఫ్ విప్‌గా పంచుమర్తి అనురాధ నియమితులయ్యారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి బోండా ఉమ(విజయవాడ సెంట్రల్), తంగిరాల సౌమ్య(నందిగామ), యార్లగడ్డ వెంకట్రావు(గన్నవరం) అసెంబ్లీ విప్‌లుగా అవకాశం లభించింది.

Similar News

News November 25, 2024

మండవల్లి: ‘ఆస్తి కోసం తమ్ముడిని హత్య చేశాడు’

image

మండవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గన్నవరం గ్రామంలో జరిగిన జంట హత్యల కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు. ఆస్తి తగాదాల నేపథ్యంలో రోయ్యూరు నగేశ్ బాబు అనే నిందితుడు తన తమ్ముడు రోయ్యూరు సురేశ్, అత్త భ్రమరాంభను కత్తితో దారుణంగా హత్యచేశాడని తెలిపారు. ఈ కేసులో 48 గంటలలో నిందితులను అరెస్ట్ చేసిన కైకలూరు సీఐ రవికుమార్‌ను, ఎస్ఐను డీఎస్పీ అభినందించారు.

News November 25, 2024

కృష్ణా: రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో జూన్ 2024లో నిర్వహించిన బీపీఈడీ 2వ సెమిస్టర్ పరీక్షలకు(2023- 24 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు ఈ నెల 29లోపు ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.900 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ తెలిపింది. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపుకై https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని సూచించింది.

News November 25, 2024

ఉమ్మడి కృష్ణాలో భారీ వర్షం కురిసే అవకాశాలు: APSDMA

image

హిందూ మహాసముద్రంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలపడిందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) MD రోణంకి కూర్మనాథ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇది పశ్చిమ- వాయువ్య దిశగా కదిలి సోమవారం దక్షిణ బంగాళాఖాతం మధ్య భాగాలపై వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో నవంబర్ 27 నుంచి 30 మధ్య ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని కూర్మనాథ్ చెప్పారు.