News March 13, 2025

అసెంబ్లీని 20 రోజులు నడపాలని డిమాండ్‌: హరీశ్‌రావు

image

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను కనీసం 20 రోజులు నడపాలని బీఏసీలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశామని హరీశ్‌రావు తెలిపారు. బీఏసీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రశ్నపత్రాలు లీక్ అయినట్లుగా అసెంబ్లీ బిజినెస్ ముందే లీక్ అవడంపై అభ్యంతరం తెలిపామన్నారు. ప్రతిపక్షాలకు మైక్ ఇవ్వొద్దని సీఎం స్వయంగా స్పీకర్‌ను బల్డోజ్‌ చేస్తున్న విషయాన్ని బీఏసీలో లేవనెత్తామన్నారు.

Similar News

News March 13, 2025

సంగారెడ్డి జిల్లాలో మహిళ హత్య

image

ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు హత్య చేసి ఆమె వద్దనున్న బంగారు కమ్మలు ఎత్తుకెళ్లిన ఘటన సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం ఖాదిరాబాద్ గ్రామంలో జరిగింది. స్థానికులు, ASI..కథనం ప్రకారం గ్రామానికి చెందిన గౌరమ్మ (45)ను బుధవారం అర్ధరాత్రి ఎవరో హత్య చేసి పరారయ్యారు. ఘటనా స్థలానికి SP పరితోష్ పంకజ్ చేరుకొని పరిశీలించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామన్నారు.

News March 13, 2025

మెదక్‌లో మహిళలు మిస్..

image

మెదక్ పట్టణంలో ఇద్దరు మహిళలు తప్పిపోయారు. వీరిలో… పాపన్నపేట్ మండలం ఎంకేపల్లి చెందిన కందెం నర్సమ్మ (50) ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అలాగే మెదక్ పట్టణానికి చెందిన నీరుడి కిష్టమ్మ (68) అదృశ్యమైంది. ఆమె మతిస్థిమితం సరిగ్గా లేదని తెలిపారు. ఇరువురు కుటుంబ సభ్యులు మెదక్ టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పైన తప్పిపోయిన వారి ఆచూకీ లభిస్తే మెదక్ టౌన్ పీఎస్‌లో తెలపాలని ఇన్స్పెక్టర్ నాగరాజు సూచించారు.

News March 13, 2025

మెదక్: బెస్ట్ ఉమన్ ఎంప్లాయ్ అవార్డు అందుకున్న DRO

image

మెదక్ జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అదే విధంగా వివిధ శాఖలకు చెందిన మహిళా అధికారులను, ఉత్తమ మహిళా ఉద్యోగులను ప్రశంసా పత్రాలతో పాటు బహుమతులను ప్రదానం చేశారు. అందులో భాగంగా ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గీత అగర్వాల్‌కు కలెక్టర్ రాహుల్ రాజ్ చేతుల మీదుగా బెస్ట్ ఉమెన్ ఎంప్లాయ్ అవార్డు అందజేశారు.

error: Content is protected !!