News July 23, 2024

అసెంబ్లీలో జగన్‌పై రెచ్చిపోయిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి

image

జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మంగళవారం అసెంబ్లీ సమావేశంలో మాజీ సీఎం జగన్‌పై రెచ్చిపోయారు. ‘జగన్ వ్యక్తిగతంగా నాపై కోడికత్తి కేసు, వివేకానంద రెడ్డి హత్య కేసు పెట్టారు. 2019 మార్చి 15న ఉదయం వివేకాకు గుండెపోటు అని చెప్పిన వ్యక్తి చివరికి నేను వైరస్‌లా దూరి చంపానన్నారు. జగన్ ఎంతోమందిని చంపించారు. అనంతబాబు ఒకరిని చంపి డిక్కీలో తీసుకొచ్చారు’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Similar News

News December 22, 2024

రాయచోటిలో కాల్పుల కలకలం

image

అన్నమయ్య జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి రాయచోటి మండలం మాధవరంలో ఈరోజు ఉదయం దుండగులు ఇద్దరు వ్యాపారులపై తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో స్థానికులు బాధితులను రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News December 22, 2024

జనవరి 29 నుంచి దేవుని కడప శ్రీవారి బ్రహ్మోత్సవాలు

image

తిరుమలకు తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో జ‌న‌వరి 29 నుంచి ఫిబ్ర‌వ‌రి 6వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ మేరకు తిరుమలలో అధికారులతో సమావేశం నిర్వహించారు. జ‌న‌వరి 28వ తేదీ సాయంత్రం అంకురార్పణ జ‌రుగ‌నుంది. జనవరి 29వ‌ తేదీ ఉద‌యం 9.30 గంట‌ల‌కు ధ్వ‌జారోహ‌ణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం కానున్నాయి.

News December 21, 2024

కడప: 1991 నాటి YS జగన్ ఫొటో వైరల్

image

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఇంటర్నెట్‌లో ఓ ఫొటో వైరల్ అవుతుంది. 1991లో జగన్ తీసుకున్న ఫొటో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆయన స్థానికంగా ఉన్న వ్యక్తితో ఫొటో దిగగా తాజాగా ఆ ఫొటో బయటకు వచ్చింది. శనివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా.. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ అభిమాని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆ పోస్టును ఆయన అభిమానులు షేర్ చేస్తున్నారు.