News September 9, 2024
అసౌకర్యాలకు నిలయంగా కుంటాల జలపాతం
నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతం వద్ద కనీస సౌకర్యాలు లేక పర్యాటకులు వేదన అనుభవిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి విశ్రాంతి గదులు లేవు. మెట్ల మార్గంలో కనీసం సేద తీరే పరిస్థితి లేదు. మార్గమధ్యలో వర్షం కురిస్తే పూర్తిగా తడిసి పోవాల్సిందే. చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతరులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జలపాతం వద్ద మూత్రశాలలు, మరుగుదొడ్లు లేవు. దీంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
Similar News
News December 22, 2024
ఆదిలాబాద్: ఈ ఏడాది 75 గంజాయి కేసులు నమోదు
ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి అనే పదం వినపడకుండా గంజాయిపై ఉక్కుపాదం మోపాలని, అందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో జిల్లాలో గంజాయిని అరికట్టేందుకు తమ వంతు కృషి చేయాలని ఎస్పీ గౌస్ ఆలం సూచించారు. ఈ ఏడాది ఇప్పటివరకు 75 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 987.425 కిలోల గంజాయి పట్టుకున్నామన్నారు. సుమారు రూ.2 కోట్ల 31 లక్షల 31 వేల 750 విలువ గల గంజాయి కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
News December 22, 2024
‘ఏజెన్సీ ప్రాంతాల్లో భాషా ప్రాతిపదికన ఉద్యోగాల నియామకాలు జరపాలి’
విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం షెడ్యూల్ ప్రాంతాల్లో భాష ప్రాతిపాదికన నియామకాలు చేపట్టాలని ఖానాపూర్ MLA వెడ్మ భొజ్జు పటేల్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జీవో నెంబర్ 3ను సుప్రీంకోర్టు కొట్టి వేయడంతో గిరిజనుల బతుకులు ఆగమ్యగోచరంగా మారిందన్నారు. కావున, ఏజెన్సీ ప్రాంతంలో భాష ప్రాతిపాదికన గిరిజనులకు ఉద్యోగాలు కల్పించి న్యాయం చేయాలన్నారు.
News December 22, 2024
MNCL: 11 నుంచి 27 వరకు టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు
మంచిర్యాల జిల్లాలో టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు జనవరి 11 నుంచి 27 వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ యాదయ్య తెలిపారు. 11 నుంచి 17 వరకు డ్రాయింగ్ లోయర్ గ్రేడ్, హైయ్యర్ గ్రేడ్ పరీక్ష, 11వ తేదీన టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్, 12, 16వ తేదీన హైయర్ గ్రేడ్ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.