News April 15, 2025
ఆ 4 ప్రాంతాలను కలిపి మెగాసిటీగా అభివృద్ధి చేస్తాం: మంత్రి నారాయణ

మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడలను కలిపి మెగాసిటీగా చేయాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి నారాయణ అన్నారు. మంగళవారం నారాయణ అమరావతిలో పర్యటించారు. రాజధాని నిర్మాణానికి ఇటీవల ప్రతిపాదించిన అదనపు భూసేకరణపై ఇంకా తుదినిర్ణయం తీసుకోలేదన్నారు. భూసేకరణ ద్వారా తీసుకుంటే రైతులు నష్టపోతారని.. సమీకరణ చేయాలని స్థానిక ఎమ్మెల్యేలు కోరారన్నారు.
Similar News
News April 19, 2025
SUMMER హాలిడేస్.. నిర్మల్ చుట్టేద్దాం చలో

వేసవి సెలవులు షురూ కావడంతో, ఎక్కడికి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారా? ప్రకృతి రమణీయత చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలు నిర్మల్ జిల్లాలో అనేకం ఉన్నాయి. నిర్మల్ కోటలు, కొయ్య బొమ్మలు ,SRSP ప్రాజెక్ట్, బాసర అమ్మవారు, కడెం ప్రాజెక్టు, కదిలి ఆలయం, సుర్జాపూర్ వెంకటేశ్వర ఆలయం, దిలావర్పూర్ ఎల్లమ్మ, సదర్మాట్ ప్రాజెక్ట్, ఎడిబిడ్ మల్లన్న ఆలయం ఈ అందమైన ప్రదేశాల్లో సందర్శించి మరుపురాని జ్ఞాపకాలను సొంతం చేసుకోండి.
News April 19, 2025
HYD: కాలేజీల్లో మే నుంచి ఫేషియల్ అటెండెన్స్

HYDలోని గాంధీ, ఉస్మానియా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలో మే 1వ తేదీ నుంచి ఆధార్ ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ అమలు చేయాలని అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు. ఇటీవల జాతీయ వైద్య కమిషన్ ఈ నిర్ణయాన్ని తీసుకుందని, ఫేషియల్ అటెండెన్స్ తప్పనిసరిగా ఉంటుందని పేర్కొన్నారు.
News April 19, 2025
JEE టాప్-10 ర్యాంకర్స్ వీరే

JEE ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఇందులో రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు తొలి రెండు ర్యాంకుల్లో నిలిచారు. మూడు, నాలుగు ర్యాంకులను పశ్చిమ బెంగాల్‌కు చెందిన విద్యార్థులు కైవసం చేసుకున్నారు. 1.MD అనాస్, 2.ఆయుష్ సింఘాల్(RJ), 3.అర్చిష్మాన్ నాండీ, 4.దేవదత్త మాఝీ(WB), 5.రవి చౌదరి(MH), 6.లక్ష్య శర్మ(RJ), 7.కుషాగ్ర గుప్తా(KN), 8.హర్ష్ ఏ గుప్తా(TG), 9.ఆదిత్ ప్రకాశ్ భగాడే(GJ), 10.దక్ష్ (DL).