News February 5, 2025
ఆ మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాలి: KMR కలెక్టర్
గడువులోగా CMR పూర్తి చేయకుండా ఉదాసీనత ప్రదర్శించే మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గడువులోగా 100% CMR పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించి ప్రతి రోజు మిల్లులను తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు. వచ్చే రబీ వరి ధాన్యం సేకరణకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.
Similar News
News February 5, 2025
శ్రీ భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ
ఓరుగల్లు ఇలవేల్పు, తెలంగాణ ఇంద్రకీలాద్రి శ్రీ భద్రకాళి దేవస్థానంలో మాఘ మాసం ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఆలయ అర్చకులు తదితరులున్నారు.
News February 5, 2025
బెల్లంపల్లి: మావోయిస్టుల లేఖ కలకలం
బెల్లంపల్లి ఏరియాలోని శాంతిఖని పాత గనిని ఓపెన్‌కాస్ట్ చేసే ప్రయత్నాలను సింగరేణి విరమించుకోవాలని మావోయిస్టు పార్టీ సింగరేణి కోల్ బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ ప్రకటనలో డిమాండ్ చేశారు. OCగా మారిస్తే పరిసర గ్రామాలతో పాటు బెల్లంపల్లి పట్టణం విధ్వంసానికి గురవుతుందన్నారు. శాంతిఖని ఓసీ నిలిపివేసేందుకు MLA వినోద్, MPవంశీకృష్ణ, కాంగ్రెస్ నాయకులు చొరవ చూపాలన్నారు. లేకపోతే OCలు బొందలగడ్డగా మారుతాయన్నారు.
News February 5, 2025
ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక నేత కన్నుమూత
ప్రపంచ ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక నేత ఆగా ఖాన్(88) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆగా ఖాన్ డెవలప్మెంట్ నెట్ వర్క్ Xలో వెల్లడించింది. ఆయన వారసుడిని త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. ఆగా ఖాన్‌కు ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. 1957లో ఆయన ఇమామ్‌గా బాధ్యతలు స్వీకరించారు.