News March 9, 2025
ఆకట్టుకున్న గద్వాల చేనేత ఉత్పత్తులు

దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో చేనేత కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శనలతో కూడిన వివిధ అమృత మహోత్సవ కార్యక్రమంలో గద్వాల చేనేత ఉత్పత్తులను ప్రదర్శించారు. ఉత్పత్తిదారులు అక్కల శాంతారాం, మంత్రి సురేష్, శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రదర్శించిన గద్వాల జరీ చీరల ప్రాముఖ్యతను ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, తెలంగాణ గవర్నర్ విష్ణు దేవ్ వర్మ, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలకు స్వయంగా వివరించారు.
Similar News
News December 14, 2025
డిసెంబర్ 14: చరిత్రలో ఈ రోజు

✤ 1799: అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ మరణం
✤1924: బాలీవుడ్ నటుడు రాజ్ కపూర్ జననం
✤ 1978: నటి సమీరా రెడ్డి జననం
✤ 1982: దక్షిణాది నటుడు ఆది పినిశెట్టి జననం
✤ 1984: నటుడు రానా జననం(ఫొటోలో)
✤ 2014: ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్, నటుడు పీజే శర్మ మరణం
✤ జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం
✤ అంతర్జాతీయ కోతుల దినోత్సవం
News December 14, 2025
నిజామాబాద్: వామ్మో చలి.. మూడు రోజులుగా వణుకు పుట్టిస్తోంది

గత మూడు రోజులుగా చలి గజగజ వణికిస్తోంది. దీంతో ప్రజలు ఇండ్లలో నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. సాయంత్రం నుంచి మొదలైన చలి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు పంజా విసురుతోంది. పెరిగిన చలి తీవ్రతను తట్టుకోలేక చాలామంది ఎండలో నిలబడి ఉపశమనం పొందుతున్నారు. కొందరు ఇళ్లలోనే మంట కాచుకుంటూ ఉపశమనం పొందుతున్నారు. చలి తీవ్రత వల్ల చాలామంది సర్ది, దగ్గు, జ్వరాల బారిన పడి కొందరు ఆసుపత్రుల్లో చేరుతున్నారు.
News December 14, 2025
మూవీ ముచ్చట్లు

* బిగ్ బాస్ తెలుగు సీజన్-9 నుంచి కమెడియన్ సుమన్ శెట్టి ఎలిమినేట్. ఇవాళ మరొకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్!
* ప్రభాస్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘రాజాసాబ్’ రిలీజ్ డేట్(జనవరి 9)లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్
* అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న ‘డెకాయిట్’ మూవీ టీజర్ ఈ నెల 18న విడుదల.. వచ్చే ఏడాది మార్చి 19న థియేటర్లలో రిలీజ్ కానున్న సినిమా


