News April 6, 2025
ఆకివీడులో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ఆకివీడు జిల్లా పరిషత్ హైస్కూల్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఓ మృతి చెందాడు. ఆకివీడు పెదపేటకు చెందిన మేకల మైకేల్ రాజ్ (40) రహదారి దాటుతుండగా ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెప్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఆకివీడు ఎస్ఐ హనుమంతు నాగరాజు తెలిపారు. కాగా మైకేల్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
Similar News
News April 9, 2025
ప.గో జిల్లా వాసులకు గ్యాస్ భారం

గ్యాస్ ధరల పెంపు ప.గో జిల్లా సామాన్యుడి తలపై గుది బండలా మారింది. గృహ అవసరాలకు వాడే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఏకంగా రూ. 50 పెరగడంతో రూ. 860కి చేరింది. ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది. ముందుగా వినియోగదారుని సొమ్ముతో సిలిండర్ బుక్ చేసుకుంటున్నారు. పలు కారణాలతో ఆ నగదు వినియోగదారుని ఖాతాకు జమ కావడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై మీ కామెంట్.
News April 9, 2025
జిల్లాలో 2,500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు: జేసీ

జిల్లాలో ఇప్పటివరకు 43 రైతు సేవా కేంద్రాలు ద్వారా 2,500 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం భీమవరం కలెక్టర్ ఛాంబర్లో సివిల్ సప్లయిస్ కార్పొరేషన్, సహకార, వ్యవసాయ, రవాణా, అసిస్టెంట్ కంట్రోల్ లీగల్ మెట్రాలజీ, అగ్రికల్చర్ ట్రెండ్ మార్కెటింగ్ శాఖల అధికారులతో సమీక్షించారు. సమస్యలు ఏమైనా ఉంటే జిల్లా కంట్రోల్ రూమ్ 8121676653 తెలియజేయాలన్నారు.
News April 8, 2025
ప.గో: రొయ్యకు రెస్ట్.. రైతుల నిర్ణయం

రొయ్యల సాగుకు మద్దతు ధరలు లేకపోవడంపై పచ్చిమ గోదావరి జిల్లా రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జులై నుంచి 3 నెలల పాటు రొయ్య సాగుకు విరామం ప్రకటిస్తున్నట్లు ఉమ్మడి ప.గో జిల్లాలోని పాలకొల్లు, నరసాపురం, ఆచంట నియోజకవర్గాలకు చెందిన రైతులు ప్రకటించారు. మేత నుంచి రొయ్యల మద్దతు ధరల వరకు తమకు అన్యాయం జరుగుతోందని, ప్రాసెసింగ్ ప్లాంట్ల నుంచి ప్రభుత్వం వరకు తమకు అండగా నిలవాలని ఆక్వా రైతులు డిమాండ్ చేశారు.