News March 22, 2025
ఆకుల సేకరణకు వెళ్లి.. అనంత లోకాలకు..!

ఎటపాక మండలం చింతలపాడు గ్రామానికి చెందిన మడివి జ్యోతిలక్ష్మి(12) తునికి చెట్టు ఎక్కి ఆకుల సేకరణ చేస్తూ.. కింద పడి ఈనెల 17న గాయపడ్డారు. ఆమెను స్థానికులు లక్ష్మీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందజేశారు. పరిస్థితి విషమించడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు.
Similar News
News March 22, 2025
యువతను డ్రగ్స్ నుంచి కాపాడుకుందాం: కలెక్టర్

యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడుకుందాని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు శనివారం పిలుపునిచ్చారు. చిత్తూరు నగరంలోని సచివాలయంలో నార్కోటిక్ కమిటీ సమావేశం నిర్వహించారు. దేశ భవిష్యత్తుకు అవసరమైన యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆయన కోరారు. ఎక్కడన్నా డ్రగ్స్ ఆనవాళ్లు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.
News March 22, 2025
నేడు ఎర్త్ అవర్ పాటించాలి: పార్వతీపురం కలెక్టర్

పార్వతీపురం జిల్లాలో ప్రజలందరూ శనివారం ఎర్త్ అవర్ పాటించాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాత్రి 8.30 నుంచి 9.30 వరకు ఎర్త్ అవర్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేసారు. ఇవాళ రాత్రి 8.30 గంటలకు ప్రజలందరూ ఇళ్లల్లో లైట్లు ఆపివేయాలన్నారు. వరల్డ్ వైల్డ్ ఫండ్ ఫర్ నేచర్ అనే సంస్థ ఆధ్వర్యంలో ఎర్త్ అవర్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
News March 22, 2025
చరణ్ బర్త్ డే.. ‘నాయక్’ రీరిలీజ్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ‘నాయక్’ సినిమాను రీరిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. గత కొన్నిరోజులుగా ‘నాయక్’ రీరిలీజ్‌పై అభిమానుల నుంచి డిమాండ్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. చరణ్, కాజల్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ తెరకెక్కించారు. ఈ చిత్రం 2013లో రిలీజవగా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. కాగా, ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించారు.