News February 3, 2025
ఆజామ్ జాహి మిల్లుపై మావోయిస్టు పార్టీ లేఖ
వరంగల్ ఆజామ్ జాహి మిల్లు వస్త్ర పరిశ్రమకు చెందిన భూములపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ వెంకటేశ్ పేరుతో ములుగు జిల్లాలో లేఖ కలకలం సృష్టిస్తోంది. భూములపై పూర్తి హక్కు కార్మికులకు, వారి కుటుంబాలకు దక్కే వరకు పోరాటాలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు. 2002లో 451 మంది కార్మికులకు బలవంతంగా వీఆర్ఎస్ ఇచ్చి మిల్లును మూసివేశారని తెలిపారు.
Similar News
News February 3, 2025
గ్రూప్-1 ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్
TG: గ్రూప్-1 పరీక్ష ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయింది. నియామకాలపై వివిధ రకాల అభ్యంతరాలతో పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో త్వరలోనే గ్రూప్-1 ఫలితాలు విడుదల కానున్నాయి.
News February 3, 2025
ట్రంప్‌తో మోదీ భేటీ.. ఎప్పుడంటే?
PM మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో త్వరలో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ప్రధాని ఈ నెల రెండోవారంలో ఫ్రాన్స్, అమెరికా పర్యటనలకు వెళ్లే అవకాశం ఉంది. ఆ సమయంలోనే ఆయన ఫిబ్రవరి 13న వాషింగ్టన్‌లో ట్రంప్‌తో భేటీ కానున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. మోదీతో సమావేశం నేపథ్యంలో ట్రంప్ డిన్నర్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. గత నెల 20న ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
News February 3, 2025
నవీపేట్: కోడి పందేలు ఆడుతున్న ఆరుగురి అరెస్టు
నవీపేట్ మండలం నాడాపూర్ గ్రామ శివారులో ఆదివారం సాయంత్రం కొంత మంది కోడి పందేలు ఆడుతుండటంతో పోలీసులు దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. ఈ దాడిలో ఆరుగురిని అరెస్టు చేసి, వారి నుంచి 2 కోడిపుంజులు, రూ.4650 స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నలుగురు నిజామాబాద్, ఒకరు సిరంపల్లి, మరొకరు తీర్మాన్‌పల్లికి చెందిన వారు ఉన్నారు. నిందితులను సోమవారం కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్ఐ వినయ్ వెల్లడించారు.