News December 28, 2024
ఆటోడ్రైవర్లు నిబంధనలు పాటించాలి: GNT ఎస్పీ
ఆటో డ్రైవర్ల ముసుగులో కొంతమంది అసాంఘిక, చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారని గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ అన్నారు. గుంటూరు నగరంలోని పోలీస్ కల్యాణ మండపంలో శనివారం ఆటోడ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నిబంధనలకు అనుగుణంగా డ్రైవర్లు వ్యవహరించాలని కోరారు. ప్రయాణీకులతో గౌరవంగా వ్యవహరించాలని సూచించారు.
Similar News
News January 1, 2025
వినుకొండలో న్యూఇయర్ వేడుకలు.. PIC OF THE DAY
వినుకొండలో విద్యార్థులు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో మంగళవారం రంగవల్లిని అందంగా అలంకరించారు. లైట్లు వెలిగించి వాటి చుట్టూ క్యాండిల్స్ వెలిగించారు. అనంతరం రంగవల్లుల చుట్టూ విద్యార్థులు మానవహారం నిర్వహించారు. దీంతో రంగవల్లి చుట్టూ ఉన్న చిన్నారుల ఫొటో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
News December 31, 2024
న్యూయర్ వేడుకలకు గుంటూరు సర్వం సిద్ధం
ఉమ్మడి గుంటూరులో న్యూయర్ వేడుకలకు యువత సిద్ధమైంది. గతంతో పోలిస్తే ఈ వేడుకల్లో ఎంతో తేడా కనిపిస్తుంది. 10ఏళ్ల కిందట వరకు గ్రీటింగ్ కార్డ్స్ పంచుకుంటూ శుభాకంక్షలు తెలిపేవారు. హైటెక్ యుగంలో వాట్సాప్ ద్వారా విషెస్ తెలుపుకుంటున్నారు. రంగురంగుల లైట్లతో నగరం, పల్లెలు మెరిసిపోతుండగా ఇళ్ల ముందు ముగ్గులతో పల్లెలు కళకళలాడుతున్నాయి. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి.
News December 31, 2024
కోరుకొండ: రేవ్ పార్టీలో 19 మంది అరెస్ట్.. వివరాలివే
తూ.గో(D) కోరుకోండలోని రేవ్ పార్టీపై పోలీసుల దాడిలో మొత్తం 19మందిని అరెస్ట్ చేశారు. గుంటూరుకి చెందిన గోపాలకృష్ణ అనే వ్యక్తి ఫంక్షన్ హాల్ బుక్ చేసి పార్టీ నిర్వహించారు. ఇక్కడికి TNK, ఆచంట, గోపాలపురానికి చెందిన 10మంది ఎరువుల డీలర్లను రప్పించారు. కాకినాడకు చెందిన మహిళ ద్వారా ఐదుగురు అమ్మాయిలను తీసుకొచ్చారు. వారితో మద్యం తాగుతూ డ్యాన్స్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసి నిందితుల్ని కోర్టులో హాజరుపర్చారు.