News April 30, 2024
ఆటోను ఢీకొన్న లారీ, ఆటో డ్రైవర్ మృతి
ఆటోను లారీ ఢీకొట్టగా ఆటో డ్రైవర్ మృతిచెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని వెంకటగిరి గ్రామానికి చెందిన గోసు గోపయ్య(42) ఆటో డ్రైవర్ గా
పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి ఖమ్మం నుంచి వెంకటగిరి వస్తుండగా మార్గమధ్యలో లారీ ఢీకొంది. దీంతో ఆటో డ్రైవర్ కు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News November 27, 2024
రూ.100 కోట్లు తిరిగి ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం: ఎమ్మెల్యే కూనంనేని
అదానీ ఇచ్చిన రూ.100 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ఇస్తామనడాన్ని స్వాగతిస్తున్నామని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. దీంతోపాటు అదానీ చేసుకున్న ఒప్పందాలలో ఏమైనా అవినీతి జరిగిందా అనే కోణాన్ని కూడా ప్రభుత్వం బయట పెట్టాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.
News November 26, 2024
కొత్తగూడెం ఎయిర్పోర్డుపై కేంద్ర మంత్రి కీలక ప్రకటన
తెలంగాణలో విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. కొత్తగూడెం విమానాశ్రయ ఏర్పాటుకు అనువైన స్థలం ఉందని సీఎం తమ దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. త్వరలోనే కొత్తగూడేనికి సాంకేతిక బృందాన్ని పంపించనున్నట్లు చెప్పారు. కొత్తగూడెంతో పాటు వరంగల్ విమానాశ్రయాన్ని కూడా ఏర్పాటు చేసే సంకల్పంతో ఉన్నట్లు చెప్పారు.
News November 26, 2024
‘ఉచిత కోచింగ్ కోసం ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలి’
విదేశాలకు వెళ్లి చదవాలనుకునే మైనార్టీ విద్యార్థుల కోసం IELTS, GRE, TOFEL పరీక్షలకు తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్ HYD ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కె.సత్యనారాయణ తెలిపారు. ఆసక్తి, అర్హత గల జిల్లా మైనార్టీ అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈనెల 30 లోపు తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్ HYD లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.