News November 20, 2024

ఆత్మకూరు పోలీసులకు మంత్రి లోకేశ్ అభినందన

image

నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం ముష్టపల్లి గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు ప్రమాదవశాత్తు బావిలో పడగా అటుగా వెళ్తున్న ఆత్మకూరు పోలీసులు ఆమెను రక్షించారు. దీనిపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘ఆత్మకూరు పోలీసుల సాహసోపేతమైన కృషిని అభినందిస్తున్నా. ఇలాంటి ధైర్యసాహసాలు ప్రాణాలను కాపాడటమే కాకుండా మానవత్వంపై ఓ ఆశను పునరుద్ధరిస్తాయి. వెల్ డన్!’ అని లోకేశ్ పోలీసులను అభినందిస్తూ ట్వీట్ చేశారు.

Similar News

News November 21, 2024

రేపటి నుంచి శ్రీశైలంలో ఉచిత బస్సు సదుపాయం

image

శ్రీశైల క్షేత్రంలో శుక్రవారం నుంచి భక్తులకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తున్నట్లు దేవస్థానం ఈవో చంద్రశేఖర ఆజాద్ గురువారం తెలిపారు. శుక్రవారం నుంచి సోమవారం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. గణేశ్ సదన్ నుంచి క్యూ కాంప్లెక్స్ వరకు ప్రతి అరగంటకు బస్సులను భక్తులకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.

News November 21, 2024

21 కేసుల్లో దొంగలించిన సొత్తు రికవరీ.. 13 మంది అరెస్టు

image

కర్నూలు జిల్లాలోని 21 కేసుల్లో దొంగలించిన సొత్తును ఆదోని ఒకటో పట్టణ పోలీసులు రికవరీ చేసి 13 మందిని అరెస్టు చేశారని ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. రూ.24 లక్షల విలువ గల బైక్‌లను ఇదివరకే రికవరీ చేశారన్నారు. ఈరోజు రూ.41 లక్షల ప్రాపర్టీ రికవరీ చేయడంలో ఆదోని సబ్ డివిజన్ పోలీసులు బాగా పని చేశారన్నారు. ఆదోని డీఎస్పీ సోమన్న, సీఐ శ్రీరామ్‌, సిబ్బందిని అభినందించారు.

News November 21, 2024

బనవాసిలో 77 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్కు: మంత్రి సవిత

image

ఎమ్మిగనూరు (మం) బనవాసిలో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకు చేనేత, జౌళి శాఖ 91 ఎకరాల ప్రభుత్వ భూమిని 2016లో TDP ప్రభుత్వం కేటాయించిందని మంత్రి సవిత తెలిపారు. నిబంధనల మేరకు మూడేళ్లలో ఈ భూమిని వినియోగించకపోవడంతో 2020లో కర్నూలు కలెక్టర్‌ ఈ కేటాయింపులు రద్దు చేసి, పేదల ఇళ్ల స్థలాలకు 13.96 ఎకరాలను కేటాయించారన్నారు. మిగతా 77 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో మంత్రి పేర్కొన్నారు.