News March 19, 2024

ఆత్మకూరు: మద్యం షాపులో రూ. 3.89 లక్షల చోరీ

image

ఆత్మకూరు పట్టణంలోని ఒక మద్యం దుకాణంలో నగదు చోరీకి గురైన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు షాపు ఒక వైపు గోడకు రంద్రం వేసి లోనికి ప్రవేశించి దుకాణంలోని రూ. 3.89 లక్షల నగదు చోరీ చేశారు. ఉదయం దుకాణం తెరిచిన సిబ్బంది చోరీ విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News April 20, 2025

నెల్లూరు: హెల్త్ ఆఫీసర్ పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణ

image

నెల్లూరు కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ చైతన్య ఆదివారం బుల్లెట్ వాహనంపై పర్యటించి పారిశుద్ధ్య పనులు పర్యవేక్షించారు. ధనలక్ష్మిపురం, నారాయణ మెడికల్ కాలేజ్ రోడ్లలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. మస్టర్లను పరిశీలించి శానిటేషన్ సెక్రటరీలకు సూచనలు చేశారు. కార్మికుల హాజరు శాతం తక్కువగా ఉండడంతో ఆదివారం కూడా పనికి వచ్చే కార్మికుల సంఖ్య తగ్గకుండా చూడాలని ఆదేశించారు.

News April 20, 2025

మనుబోలు: పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు

image

మనుబోలు మండలంలోని వడ్లపూడి వద్ద ఆదివారం కారు బోల్తా పడి అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో కారులో ఐదుమంది ఉన్నారు. వీళ్లంతా సురక్షితంగా బయటపడ్డారు. పొదలకూరు మండలం బిరదవోలు రాజుపాలెంకు చెందిన వారు కొత్త కారును కొనుగోలు చేసి గొలగమూడిలో పూజలు చేయించుకొని తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

News April 20, 2025

NLR: చెట్టును ఢీకొట్టిన బైక్.. యువతి మృతి

image

నెల్లూరు జిల్లాలో ఉదయాన్నే జరిగిన ప్రమాదంలో ఒకరు చనిపోయారు. మర్రిపాడు మండలం కదిరినాయుడు పల్లి సమీపంలో నెల్లూరు-ముంబయి జాతీయ రహదారిపై ఓ బైక్ చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకుపై ఉన్న యువతి అక్కడికక్కడే మృతిచెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!