News August 16, 2024

ఆత్మకూర్: యాక్సిడెంట్‌.. 2 నెలల పసికందు మృతి

image

ORRపై <<138659>>యాక్సిడెంట్‌<<>>లో చనిపోయిన ముగ్గురిలో 2 నెలల బాలుడు ఉన్నారు. ఆత్మకూర్‌కు చెందిన 12 మంది తూఫాన్‌ వాహనంలో యాదాద్రికి నుంచి వస్తున్నారు. కరీంనగర్‌ నుంచి శంషాబాద్‌ వెళ్తున్న కారు వేగంగా వచ్చి వెనుక నుంచి తూఫాన్‌ను బలంగా ఢీకొట్టడంతో ఎగిరిపడింది. తూఫాన్‌లో ఉన్న డ్రైవర్ తాజ్‌, వరాలు స్పాట్‌లో చనిపోయారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ 2 నెలల బాలుడు మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదైంది.

Similar News

News November 5, 2024

11న కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి 

image

పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ కురుమూర్తి బ్రహ్మోత్సవాలు పాల్గొనడానికి సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 11న కురుమూర్తికి రానున్నారు. సీఎం రాక కోసం మంగళవారం స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు కూడా  కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు హాజరుకానున్నారు.

News November 5, 2024

అలంపూర్: అధికారిక చిహ్నం మార్పు.. కలెక్టర్ స్పష్టత

image

జోగులాంబ గద్వాల జిల్లా, కర్నూల్ అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో అలంపూర్ వద్ద ఆర్టీఏ చెక్ పోస్ట్ దగ్గర అధికారులు పెట్టిన బారీకేడ్లపై అధికారిక చిహ్నం మార్పు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. దీనిపై జోగులాంబ కలెక్టర్ స్పందించారు. వెంటనే తప్పుడు లోగో ఉన్న బారీకేడ్లను తొలగించినట్లు కలెక్టర్ తెలిపారు.

News November 5, 2024

NRPT: చిరుతపులి దాడిలో మేకలు మృతి !

image

నారాయణపేట మండలం గనిమోనిబండ గ్రామ శివారులో చిరుతపులి దాడిలో రెండు మేకలు మృతిచెందాయని బాధితులు పేర్కొన్నారు. వెంకటప్ప తన మేకలను మేత కోసం సోమవారం అడవికి తీసుకెళ్ళారు. వాటిలో రెండు కనిపించకపోవడం మంగళవారం అడవిలో వెతకగా రెండు మేకలు మృతి చెంది కనిపించాయి. చిరుతపులి చేసిన దాడిలో మృతి చెందాయని బాధితుడు వాపోయారు. చిరుత సంచారంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. అయితే చిరుత సంచారంపై క్లారిటీ రావాల్సి ఉంది.