News March 31, 2025
ఆదిలాబాద్: 13వ రోజుకు చేరుకున్న దీక్ష

ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్ష 13వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు పలు యువజన నాయకులు, వివిధ సంఘాల నేతలు మద్దతు తెలిపారు. సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి సీసీఐ పునరుద్ధరణకు కృషి చేయాలని కోరారు.
Similar News
News April 3, 2025
ADB: బెల్ట్ షాపులపై పోలీసుల రైడ్.. నలుగురిపై కేసు

ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్య నగర్, శ్రీరామ్ కాలనీలో బెల్ట్ షాపులపై తనిఖీ నిర్వహించారు. అందులో నలుగురు వ్యక్తులు అనుమతులు లేకుండా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ మద్యం విక్రయాలు చేసినందుకు వారిపై 2 టౌన్ పీఎస్‌లో కేసు నమోదు చేసినట్లు సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ పి.చంద్రశేఖర్ తెలిపారు. నాలుగు దుకాణాల్లో పట్టుబడ్డ మద్యం విలువ దాదాపు రూ.15,370 ఉందని పేర్కొన్నారు.
News April 3, 2025
ADB: ‘మహనీయుల జయంతి ఉత్సవాలను నిర్వహించాలి’

మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులు, సంఘ నాయకులకు సూచించారు. బాబూ జగ్జీవన్ రాం, బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలకు సంబంధించి బుధవారం నిర్వహించిన ఆదిలాబాద్ కలెక్టరేట్లో సన్నాహక సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలసి ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 5న బాబు జగ్జీవన్‌రామ్ 118వ జయంతి, 14న బీఆర్ అంబేడ్కర్ 134వ జయంతిని జిల్లాలో ఘనంగా నిర్వహిస్తామన్నారు.
News April 2, 2025
ADB: వేధింపులా.. 8712659953కి కాల్ చేయండి: SP

మహిళలు, విద్యార్థినులకు ఉద్యోగస్థలాల్లో, కళాశాలల్లో ఎలాంటి సమస్యలున్నా, వేధింపులకు గురైనా జిల్లా షీ టీం బృందాలను సంప్రదించాలని SP అఖిల్ మహాజన్ సూచించారు. షీ టీం బృందాలను సంప్రదించడానికి 24 గంటలు పని చేసేలా ఒక మొబైల్ నెంబర్ 8712659953ను ఏర్పాటుచేశామన్నారు. జిల్లాలో గత నెలల్లో 34 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఫిర్యాదులు అందిన వాటిలో 3 కేసులు, మావల పీఎస్‌లో ఒక FIR నమోదు చేసినట్లు చెప్పారు.