News March 2, 2025
ఆదిలాబాద్ AIRPORT కలగానే మిగిలిపోతుందా..?

ఆదిలాబాద్లో AIRPORT కలగానే మిగిలిపోతోంది. రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం వరంగల్ AIRPORTకు అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా జిల్లాలో కూడా ఎయిర్ పోర్టు నిర్మాణానికి త్వరగా అడుగులు పడేలా చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు. AIRPORT నిర్మాణానికి స్థలం ఉన్నప్పటికీ దానికి సంబంధించిన పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News March 3, 2025
గుడిహత్నూర్: పురుగు మందు తాగి బాలిక సూసైడ్

గుడిహత్నూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సూర్యగూడ గ్రామానికి చెందిన గెడం వేదిక(16) సోమవారం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబీకులు వెంటనే 108లో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందినట్లు వెల్లడించారు.
News March 3, 2025
ఆదిలాబాద్: కౌంటింగ్ షురూ… అభ్యర్థుల్లో ఉత్కంఠ

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ జిల్లాలో ఇటీవల ప్రశాంతంగా ముగిసింది. అయితే సోమవారం ఇందుకు సంబంధించిన ఫలితాల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో పోటీచేసిన అభ్యర్థులలో ఉత్కంఠ రేపుతోంది. ఎవరి భవితవ్యం ఎలా ఉండబోతుందో తేలిపోనుంది. మొత్తం14935 మందికి గాను 10,396 మంది ఓటు వేయగా 69.61 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే టీచర్స్ 1,593 మంది ఉండగా 1,478 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.
News March 3, 2025
నేరడిగొండ: WOW.. ఇక్కడి ఆడపడుచులు GREAT

నేరడిగొండ మండలం మంగల్ మోట (తర్నం) గ్రామానికి చెందిన ఆడపడుచులు పేదింటి యువతి పెళ్లికి ఆర్థిక సాయం చేసి అండగా నిలిచారు. ఆదివాసీ గ్రామాల్లో కట్న కానుకలను నిషేధిస్తూ ఆదివాసీలు తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఎలాంటి కట్న కానుకలు లేకపోవటంతో గ్రామంలో 60 కుటుంబాల ఆడపడుచులు కలిసి వారికి తోచినంత పొదుపు చేసుకొని రూ.12,342 ఆర్థిక సాయాన్ని అందజేశారు.