News October 31, 2024
ఆదిలాబాద్: NHM ఉద్యోగుల తుది జాబితా విడుదల
ఆదిలాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖ పరిధిలో NHM పథకంలో జిల్లా కార్యక్రమ సమన్వయకర్త, సీనియర్ డాట్స్ ప్లస్ టీబీ, హెచ్ఐవీ(STS), TBHV ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసినట్లు DMHO కృష్ణ తెలిపారు. అలాగే మూడు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, ఒక PMDT, TBHV సమన్వయకర్త పోస్టుల ప్రొవిజనల్ జాబితాను సైతం విడుదల చేసినట్లు పేర్కొన్నారు. జాబితాలను కార్యాలయ నోటీసు బోర్డుపై ఉన్నాయన్నారు.
Similar News
News October 31, 2024
తాంసి: నాలుగు రోజుల పాటు సోయా కొనుగోళ్లు బంద్
తాంసి మండల మార్కెట్ పరిధిలో సోయా కొనుగోళ్లను గురు, శుక్ర, శని, ఆదివారాల్లో నాలుగు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు సెంటర్ ఇన్‌ఛార్జ్ చింతల కేశవ్ ఒక ప్రకటనలో తెలిపారు. దీపావళి సందర్భంగా కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తిరిగి నవంబర్ 4వ తేదీన కొనుగోళ్లు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. రైతులు సహకరించాలని కోరారు.
News October 31, 2024
ఆదిలాబాద్: శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు
కార్తిక మాసాన్ని పురస్కరించుకుని శైవ క్షేత్రాలను సందర్శించాలనుకునే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ RM సోలోమన్ పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని డిపోల నుంచి వేములవాడకు, తమిళనాడులోని అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసేందుకు బస్సులు నడుపుతామని పేర్కొన్నారు. అరుణాచలం గిరి ప్రదక్షిణలకు వెళ్లే భక్తులు ఆన్‌లైన్లో బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ఈ సేవలు వినియోగించుకోవాలని కోరారు.
News October 31, 2024
ఆదిలాబాద్‌లో 23,10,190 మంది ఓటర్లు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. ఓటు నమోదుపై అవగాహన, ఎన్నికల సంఘం, అధికారులు చేపట్టిన కార్యక్రమాలతో ఓటర్ల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో పది నియోజకవర్గాల్లో మొత్తం 23,10,190 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 11,31,150 మంది పురుష ఓటర్లు, 11,78,906 మంది మహిళా ఓటర్లు, 134 మంది ఇతరులు ఉన్నారు. పురుషుల కంటే మహిళల జనాభానే అధికంగా ఉన్నట్లు కనిపిస్తుంది.