News March 14, 2025
ఆదిలాబాద్: PHOTO OF THE DAY

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. పండుగ సందర్భంగా చిన్నారులు రంగులు పూసుకొని సందడి చేసిన ఫొటో ఆకట్టుకుంటుంది. జిల్లాలోని యువత, చిన్నారులు రంగులు చల్లుకుంటూ డీజే పాటలకు డాన్సులు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. పలు గ్రామాల్లో చేసిన సంప్రదాయ నృత్యాలు అలరించాయి. మీ ప్రాంతంలో హోలీ ఎలా జరిగిందో కామెంట్ చేయండి.
Similar News
News March 15, 2025
గ్రూప్-3లో బజార్హత్నూర్ వాసికి 74వ ర్యాంక్

గ్రూప్-3 ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. ఇందులో బజార్హత్నూర్ మండలానికి చెందిన బిట్లింగ్ లక్ష్మమన్, నీల దంపతుల కుమారుడు ఉదయ్ కుమార్ 74వ ర్యాంక్ సాధించారు. ఇటీవల గ్రూప్-2 లో ఫలితాల్లో సైతం ఉదయ్ కుమార్ సత్తా చాటాడు. పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న ఆయనకు కుటుంబ సభ్యులతో పాటు మండల వాసులు అభినందనలు తెలిపారు.
News March 15, 2025
ADB: రేపే ఏకలవ్య పాఠశాల ప్రవేశ పరీక్ష

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 4 ప్రభుత్వ ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి కోసం ప్రవేశానికి ఈ నెల 16వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు RCO అగస్టీన్ అన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఇంద్రవెల్లిలోని పాటగూడ, ఉట్నూర్, అసిఫాబాద్లోని సిర్పూర్(టి) EMRS పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
News March 15, 2025
జైనథ్: 2 ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన అశోక్

జైనథ్ మండలం అడ గ్రామానికి చెందిన దుర్ల అశోక్ కుమారుడు అవినాశ్ శుక్రవారం విడుదలైన గ్రూప్-3 ఫలితాల్లో ఎంపికయ్యారు. ఆయన ఇటీవల విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో సైతం ఉద్యోగం సాధించారు. జిల్లాకేంద్రంలోని ఎస్సీ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకుంటు ప్రిపేర్ అయినట్లు అవినాశ్ తెలిపారు. ఉద్యోగం సాధించడం పట్ల ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డా.రమేశ్ ఆయన్ను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.