News March 4, 2025

ఆదిలాబాద్: అటవీ ప్రాంతంలో కార్చిచ్చు

image

ఆదిలాబాద్ రూరల్ మండలం చింతగూడ అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి కార్చిచ్చు అంటుకుంది. సమాచారం అందుకున్న ఎస్పీ గౌష్ ఆలం అటవీ అధికారులు, అగ్నిమాపక శాఖను అప్రమత్తం చేశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అటవీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. 

Similar News

News March 4, 2025

ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధర వివరాలు

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో మంగళవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,900గా నిర్ణయించారు. సోమవారం ధరతో పోలిస్తే మంగళవారం సీసీఐ ధరలో మార్పు లేదు. ప్రైవేట్ పత్తి ధర రూ.10 తగ్గినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.

News March 4, 2025

జైపూర్‌లో ఇంటర్ విద్యార్థిని సూసైడ్

image

ఇంటర్ విద్యార్థిని సూసైడ్ చేసుకున్న ఘటన జైపూర్ మండలం శెట్పల్లిలో జరిగింది. SI శ్రీధర్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన హాసిని చెన్నూర్ కేజీబీవీలో ఇంటర్ చదివి ఇష్టం లేక ఇంటికి వచ్చింది. ఆమెకు తండ్రి సర్దిచెప్పి తిరిగి మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చేర్పించగా 2 నెలలు కాలేజీకి వెళ్లింది. ఆ తర్వాత ఇంటి వద్దే ఉంటూ పరీక్షలకు సన్నద్ధమవుతుంది. పరీక్షల్లో ఫేయిల్ అవుతాననే భయంతో ఆదివారం ఉరేసుకుంది.

News March 4, 2025

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ADB అదనపు కలెక్టర్

image

యాసంగిలో పంటలకు సాగునీటిలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ సచివాలయం నుంచి పలు అంశాలపై జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ శ్యామలదేవ పాల్గొన్నారు. జిల్లాలో సాగునీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎస్ సూచించారు.

error: Content is protected !!