News May 26, 2024
ఆదిలాబాద్: ఈ ఏడాది తగ్గిన రిజిస్ట్రేషన్‌లు..!

ఆదిలాబాద్ జిల్లాలో రిజిస్ట్రేషన్లు గతేడాదితో పోల్చితే ఈ ఏడాది భారీగా తగ్గాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతగా లేకపోవడంతో భూములు, ప్లాట్లు, ఇళ్ల క్రయ విక్రయాలు ఆశించిన స్థాయిలో జరగలేదని తెలుస్తోంది. జిల్లాలోని ఆదిలాబాద్, బోథ్ రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 1,342 రిజిస్ట్రేషన్లు తగ్గాయి. దీంతో ఆ శాఖకు సుమారు రూ.7.3కోట్ల ఆదాయం తగ్గింది.
Similar News
News March 13, 2025
ADB: కామదహనం ఏర్పాట్లు చేస్తున్న ఆదివాసీలు

ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గూడ, తండాల్లో గురువారం సుమారు 8 గంటలకు జరిగే కామదహనం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివాసీ పెద్దలు కలిసి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రంగుల పండుగ హోలీని పురస్కరించుకొని జరుగుతున్న ఈ వేడుకలలో కొబ్బరి, నైవేద్యాలతో కూడిన పదార్థాలతో సంబరాలు చేసుకుంటారు. వాటిని వెదురుతో అంటించిన మంటల్లో పెట్టి పోటీలు నిర్వహిస్తారు.
News March 13, 2025
ఆదిలాబాద్ ప్రజలకు ఎస్పీ సూచనలు

ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా హోలీ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. హోలీ వేడుకలు ప్రశాంతంగా నిర్వహించాలని, నదులు, వాగులు, చెరువులకు ఈతరాని వారు వెళ్లవద్దని, తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై జాగ్రత్తలు వహించాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, రాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News March 13, 2025
ఇంద్రవెల్లి: భార్య కాపురానికి రావడం లేదని సూసైడ్

భార్య కాపురానికి రావడం లేదని నిప్పంటించుకొని ఆత్మహత్యానికి పాల్పడిన ఘటన ఇంద్రవెల్లి మండలంలో చోటు చేసుకుంది. ఏఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. కుబీర్ మండలం మర్లకొండాకు చెందిన కృష్ణ ADBలో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. మద్యానికి బానిసై భార్య సంగీతను వేధించాడు. దీంతో ఆమె ఇంద్రవెల్లి మండలం శంకర్‌గూడకు వచ్చి ఉంటున్నారు. ఈనెల 2న కృష్ణ మద్యం తాగి భార్యతో గొడవపడి సూసైడ్ చేసుకున్నారు.