News February 25, 2025
ఆదిలాబాద్: ఈనెల 28 వరకు వారోత్సవాలు

ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, అందుకు తప్పనిసరిగా బాధ్యతగా డబ్బును పొదుపు చేసి ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆర్బీఐ వారోత్సవాల్లో భాగంగా ఆర్థిక క్రమశిక్షణ వారోత్సవాలను నిర్వస్తున్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వారోత్సవాల పోస్టర్లను అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ నెల 24 నుంచి 28 వరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News February 25, 2025
ఆదిలాబాద్‌లో యువకుడి దారుణ హత్య

ఆదిలాబాద్‌లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మార్కెట్ యార్డ్ వెనకాల ఇందిరానగర్‌లో రవితేజ (30) అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం ఉదయం హత్య చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి వెల్లడించారు. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్ బృందాలతో ఆధారాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. మృతుడు క్రాంతినగర్ వాసిగా గుర్తించినట్లు తెలిపారు.
News February 25, 2025
పోలింగ్ ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలి: ADB కలెక్టర్

శాసన మండలి ఎన్నికల సందర్భంగా పోలింగ్ సిబ్బందికి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రెండో విడత శిక్షణ తరగతులను సోమవారం నిర్వహించారు. కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ.. ఈ నెల 27న జరగనున్న పోలింగ్ ప్రక్రియపై సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలింగ్‌కు ఒక రోజు ముందుగానే ఉదయం 8 గంటలకు ప్రిసైడింగ్ అధికారులు తమ బృందంతో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకోవాలని సూచించారు.
News February 25, 2025
ADB: మహాశివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆదిలాబాద్ ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బస్సు సౌకర్యాలు కల్పించినట్లు సంస్థ రీజినల్ మేనేజర్ సోలోమన్ తెలిపారు. రీజినల్ పరిధిలోని నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ డిపోల నుంచి ఈనెల 25 నుంచి 27వ వరకు వేములవాడ, వేలాల, బుగ్గ, నంబాల, వాంకిడి, ఈజ్గాంకు 93 బస్సులను 833 ట్రిప్పుల్లో నడపనున్నట్లు వెల్లడించారు.