News March 12, 2025

ఆదిలాబాద్: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి జిల్లాలో డిగ్రీ పాసైన బీసీ అభ్యర్థులకు బ్యాంకింగ్ & ఫైనాన్స్‌లో ఉచిత ట్రైనింగ్, ఉద్యోగం కల్పించడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రాజలి, స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ తెలిపారు. ట్రైనింగ్ ప్రోగ్రాం పూర్తయిన తర్వాత ప్రైవేట్ బ్యాంకుల్లో ప్లేస్‌మెంట్ కల్పిస్తారన్నారు. అర్హులు ఈనెల 15 నుంచి www.tgbcstudycircle.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. SHARE IT

Similar News

News March 13, 2025

నాని సవాల్‌.. డైరెక్టర్ రియాక్షన్ ఇదే

image

తాను నిర్మాతగా తెరకెక్కించిన ‘కోర్టు’ సినిమా నచ్చకపోతే ‘హిట్-3’ చూడొద్దని హీరో నాని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ‘కోర్టు’ మూవీని సినీ ప్రముఖులు, మీడియాకు ప్రీమియర్ షో ప్రదర్శించారు. మూవీ చూసిన దర్శకుడు శైలేష్ కొలను తన సినిమా(హిట్-3) సేఫ్ అని ట్వీట్ చేశారు. కోర్టు మూవీ అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.

News March 13, 2025

మహబూబాబాద్: ఆవు ఢీకొని వ్యక్తి మృతి

image

మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సాలార్ తండా వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ నుంచి బైక్‌పై వెళ్తున్న సంపత్ అనే వ్యక్తిని రోడ్డుపై ఆవు ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కురవి మండలం సుధనపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు.

News March 13, 2025

సంగారెడ్డి: నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వల్లూరు క్రాంతి హెచ్చరించారు. సంగారెడ్డిలో బుధవారం ఆమె మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆస్తి పన్ను వసూలు చేయాలని చెప్పారు. ఎల్ఆర్ఎస్‌పై కూడా ప్రజలకు అవగాహన కల్పించి రెగ్యులర్ చేసుకునేలా చూడాలని పేర్కొన్నారు.

error: Content is protected !!