News May 17, 2024

ఆదిలాబాద్: ఉదయాన్నే రోడ్డు ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం

image

రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్ దుర్మరణం చెందిన సంఘటన శుక్రవారం మావల సమీపంలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. నిర్మల్ వైపు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో మరో లారీ వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో మహారాష్ట్ర నాందేడ్ జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ షేక్ అజీమ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. 108 అంబులెన్స్ సిబ్బంది కిషన్, ముజఫర్ అతనిని ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.

Similar News

News January 24, 2025

రైల్వే జీఎంను కలిసిన ఆదిలాబాద్ ఎంపీ నగేష్

image

సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్‌ను సికింద్రాబాద్‌లోని ఆయన కార్యాలయంలో ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేష్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని రైల్వే అభివృద్ధి పనులతో పాటు రైల్వే స్టేషన్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. రైళ్ల సంఖ్యను పెంచాలని కోరారు. ఈ విషయాలపై రైల్వే జిఎం సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు.

News January 24, 2025

ADB: JAN 28 నుంచి కందుల కొనుగోళ్లు

image

పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేది నుంచి కందుల కొనుగోలు ప్రారంభమవుతాయని మార్క్ ఫెడ్ డీఏం ప్రవీణ్ రెడ్డి గురువారం తెలిపారు. ఈనెల 30 నుంచి జైనథ్ మార్కెట్ యార్డ్‌లో సైతం కొనుగోలు ప్రారంభమవుతాయన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి కందులను మార్కెట్ యార్డుకు తీసుకొని రావాలని సూచించారు.

News January 24, 2025

ADB: జిల్లాలో మరో కౌలు రైతు ఆత్మహత్య

image

ఆదిలాబాద్ జిల్లాలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు ఆత్మహత్యలు చేసుకోగా తాజాగా బేల మండలంలోని మీర్జాపూర్ గ్రామానికి చెందిన కౌలు రైత గోవింద్ గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. 4 ఎకరాల కౌలు భూమిలో పత్తి సాగు చేయగా, దిగుబడి రాక పురుగుల మందు తాగి పొలంలో ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. మృతుడికి రూ.5లక్షల అప్పు ఉన్నట్లు సమాచారం.