News May 9, 2024

ఆదిలాబాద్: ఉరేసుకొని బలవన్మరణం

image

మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదిలాబాద్ పట్టణం రాంనగర్‌లో రాపర్తి ప్రకాష్ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఏఎస్ఐ యూనుస్ తెలిపిన వివరాల మేరకు.. కూలి పని చేసుకుని జీవించే ప్రకాష్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ సమస్య తట్టుకోలేక జీవితంపై విరక్తితో గురువారం ఉదయం ఇంట్లోనే ఉరేసుకున్నారు. కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Similar News

News January 19, 2025

నిర్మల్: ఎడ్ల బండిని ఢీకొట్టిన బైక్.. బాలుడి మృతి

image

నిర్మల్ జిల్లాలో ఎడ్ల బండిని బైక్ ఢీకొట్టడంతో కొడుకు మృతిచెందగా తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. పెంబి మండలం సెట్‌పల్లి గ్రామానికి చెందిన పవర్ రాజు తన కొడుకు అఖిల్‌తో కలిసి బైక్‌పై రాత్రి పెంబి నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో మార్గ మధ్యలో ఎడ్ల బండిని బైక్ ఢీకొట్టింది. దీంతో ఎద్దు అక్కడికక్కడే మృతిచెందగా.. రాజు, అఖిల్ తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగా అఖిల్ మృతి చెందాడు.

News January 19, 2025

నిర్మల్: దైవ దర్శనానికి వెళ్తుండగా యాక్సిడెంట్

image

నిర్మల్ జిల్లాలో<<15191861>> రోడ్డు ప్రమాదం<<>> రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. MHలోని జబల్పూర్‌కు చెందిన సమిత(53), విజయ్(57), నితిన్, అనిత, సుదీర్ శ్రీశైలం దర్శనానికి కారులో వెళ్తున్నారు. మామడ మండలం బూర్గుపల్లి సమీపంలో హైవేపై అడ్డొచ్చిన కోతులను తప్పించబోయి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో సమిత, విజయ్ స్పాట్‌లోనే చనిపోగా మిగతా ముగ్గురు గాయపడ్డారు. దర్శనానికి వెళ్తుండగా 2 కుటుంబాల్లో ఒక్కొక్కరు చనిపోవడం విషాదకరం.

News January 19, 2025

ADB: విద్యుదాఘాతంతో బాలికకు తీవ్ర గాయాలు

image

విద్యుదాఘాతంతో బాలిక తీవ్ర గాయాలపాలైన ఘటన శనివారం ఆదిలాబాద్‌లో చోటు చేసుకుంది. పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన షేక్ తహ్రీం ఇంటి స్లాబ్ పై వెళ్లగా పైనుంచి వెళుతున్న హైఓల్టేజీ విద్యుత్ తీగలతో షాక్ కొట్టింది. దీంతో ఆమె చేయి, కాలుతో పాటు శరీరం ఒక పక్క దాదాపు 40 శాతం కాలిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు స్ధానిక రిమ్స్‌కు తరలించారు. అనంతరం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.