News February 28, 2025
ఆదిలాబాద్: కనిపించకుండాపోయి.. శవమై తేలి

ఓ వ్యక్తి కనపడకుండా పోయి శవమై తేలిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. ఆదిలాబాద్ వన్ టౌన్ CI సునీల్ కుమార్ వివరాలు.. ఖానాపూర్‌కు చెందిన సాయికుమార్ (28) ఈనెల 22 నుంచి కనపడడం లేదని సోదరుడు గణేశ్ 25న ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదైంది. అయితే ఖానాపూర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోగా గురువారం శవమై కనిపించాడు. కుడి కన్నుకు ఆపరేషన్ కాగా కన్ను నుంచి నీరు, చీము కారుతుందని అది భరించలేక సూసైడ్ చేసుకున్నాడు.
Similar News
News February 28, 2025
రేపు ఆదిలాబాద్‌కు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి..

ఆదిలాబాద్‌లో శనివారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రేణుకా యారా పర్యటించనున్నారు. జిల్లా కోర్టులో డిస్పెన్సరీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 5 గంటలకు హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరి 10 గంటలకు ఆదిలాబాద్‌కు చేరుకుంటారు. ఉ. 10.30 జిల్లా కోర్టుకు రానున్నారు. అనంతరం మరుసటి రోజు ఆదివారం ఉదయం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.
News February 28, 2025
ADB: చెట్లకు ఆధార్.. స్పందించిన KTR

ఇచ్చోడ మండలం ముఖ్రా(కె) మాజీ సర్పంచ్ గాడ్గె మీనాక్షి పర్యావరణ పరిరక్షణకు కొత్తబాట వేసిన విషయం తెలిసిందే. ‘డిజిటల్ ట్రీ ఆధార్’తో ప్రతి చెట్టును జియో-ట్యాగ్, క్యూఆర్ కోడ్‌లను కేటాయించారు. దీనిపై KTR స్పందించారు. చెట్లు నాటడమే కాకుండా వాటిని కాపాడుకోవటం, చెట్లకు కూడా ఆధార్ కార్డును రూపొందిండం అద్భుతమైన ఆలోచన అని కొనియాడారు. దీనికి ఆద్యురాలైన మీనాక్షికి అభినందనలు తెలిపారు.
News February 28, 2025
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా పై పాటను స్వరపరిచిన కైలాష్

కృత్రిమ మేధాతో అద్భుతాలు సృష్టిస్తున్న తొడసం కైలాష్ తాజాగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా పైన “ఎంత మంచివాడమ్మ మన ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్” అనే పాటను కంపోజ్ చేసి పాడించారు. తొడసం కైలాష్ మాట్లాడుతూ.. తన యూట్యూబ్ ఛానల్ లో ఈ పాట అందరికి అందుబాటులో ఉంచానని, చాలా మంచి రెస్పాన్స్ వస్తున్నదని తెలిపారు. కింది లింక్ ద్వారా పాటను వినవచ్చు.