News July 5, 2024
ఆదిలాబాద్: కాంగ్రెస్‌లో చేరిన MLC దండె విఠల్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా BRS MLC దండె విఠల్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం రాత్రి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆరుగురు MLCలు కాంగ్రెస్‌లో.. చేరగా అందులో విఠల్ ఉన్నారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Similar News
News March 8, 2025
ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధర వివరాలు

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో శనివారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,900గా నిర్ణయించారు. శుక్రవారం ధరతో పోలిస్తే శనివారం ధరల్లో మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.
News March 8, 2025
ADB: నేడు మహిళా ఉపాధ్యాయులకు ప్రత్యేక సెలవు

జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో పని చేస్తున్న మహిళా ఉపాధ్యాయులకు శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించి ప్రత్యేక సెలవు మంజూరు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ప్రణీత తెలిపారు. కాగా జనవరి 31న నాగోబా జాతర సందర్భంగా పాఠశాలలకు లోకల్ హాలిడే ప్రకటించగా.. ఇవాళ రెండో శనివారం జిల్లాలోని పాఠశాలలకు పనిదినంగా ప్రకటించారు.
News March 8, 2025
పురుగుల మందు తాగి యువకుడు మృతి

బోథ్ మండలం చింతగూడకి చెందిన గేడం వినోద్ కుమార్ (25) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం మార్చి 12న తల్లిదండ్రులు మందలించడంతో పురుగుల మందు తాగాడు. ADB రిమ్స్ లో చికిత్స పొంది మార్చి 4 న ఇంటికి తీసుకెళ్లారు. అనారోగ్యం తిరగబెట్టడంతో నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మరణించాడని తెలిపారు