News May 6, 2024

ఆదిలాబాద్: గుర్తుతెలియని అస్థిపంజరం లభ్యం

image

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్‌లో గుర్తుతెలియని <<13186266>>అస్థిపంజరం <<>>లభ్యమైన విషయం తెలిసిందే. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. నిపాని గ్రామానికి చెందిన భూమన్న వారం క్రితం హనుమాన్ మాలధరించి అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు. అస్థిపంజరం పక్కన పురుగు మందు డబ్బా ఉండటంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. మృతదేహాన్ని కుక్కలు, అడవి పందులు పీక్కుతిన్నాయి. అస్థిపంజరం ముఖభాగం ఉండటంతో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News January 16, 2025

ఆదిలాబాద్: రైతు భరోసా సర్వేకు 102 బృందాలు

image

ADB జిల్లా రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా లక్షా 62వేల పట్టా పాసు పుస్తకాలు ఉండగా ఆ డేటా ఆధారంగానే అధికారులు వెరిఫికేషన్ చేయనున్నారు. 102 క్లస్టర్లలో సర్వేకు 102 అధికార బృందాలు సిద్ధమయ్యాయి. ఇందులో వ్యవసాయ, రెవెన్యూ, పంచాయతీ రాజ్ అధికారులు పాల్గొంటారు. గతంలో సాగు అనువుకాని భూమికి సైతం రైతుబంధు ఇచ్చారనే ఆరోపణల నేపథ్యంలో పకడ్బందీగా సర్వే చేయనున్నట్లు వారు చెబుతున్నారు.

News January 16, 2025

ADB: మైనర్‌ను నమ్మించి అత్యాచారం చేశాడు..!

image

యువకుడిపై ADB పోలీసులు పోక్సో కేసు నమోదుచేశారు. CI కర్ణాకర్ కథనం ప్రకారం.. ADBరిమ్స్‌లో చదువుతున్న బాలిక(17)కు INSTAGRAMలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకులకు చెందిన శివ పరిచయమయ్యాడు. పెళ్లిచేసుకుంటానని నమ్మించడంతో ఈనెల 9న HYDవెళ్లగా ఆమెను ప్రలోభపెట్టి అత్యాచారం చేశాడు. ఆమె కనిపించకపోవడంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఆచూకీ తెలుసుకొని ADBరప్పించి ఆమె వాంగ్మూలం తీసుకొని కేసువేశారు.

News January 16, 2025

ప్రజలు పోలీసు సేవలు వినియోగించుకోవాలి: నిర్మల్ SP

image

భైంసా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో బుధవారం గ్రీవెన్స్‌డే నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. వాటిని తక్షణమే పరిష్కరించాలని ఎస్ఐ, సీఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా పోలీసు సేవలను వినియోగించుకోవాలని కోరారు.