News March 20, 2025
ఆదిలాబాద్: నియోజకవర్గానికి 3500 ఇళ్ల మోక్షం

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో సంక్షేమ రంగాలకు అధిక ప్రాధాన్యం కనిపిస్తోంది. ప్రభుత్వం అభయహస్తం కింద అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలకు నిధులు కేటాయించింది. దీంతో తొలి విడతలో చేపట్టనున్న నియోజకవర్గానికి 3500 చొప్పున ఇళ్ల నిర్మాణానికి మోక్షం లభించనుంది. ఉమ్మడి జిల్లాలో 35 వేల మందికి లబ్ది చేకూరనుంది. గృహజ్యోతి కింద 3.60లక్షల మందికి లాభం జరగనుంది. పింఛన్‌ల లబ్ధిదారుల సంఖ్య రెట్టింపు కానుంది.
Similar News
News March 23, 2025
ఆదిలాబాద్: రేపటి నుంచి 6రోజుల పాటు శిక్షణ

ఆదిలాబాద్‌లోని TTDCలో విపత్తు నిర్వహణపై ఈ నెల 24 నుంచి 29 వరకు మర్రి చెన్నారెడ్డి ఇన్‌స్టిట్యూట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. 18 నుంచి 40 సం.రాల వయస్సు లోపు పది పాసైన 50 మందికి అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. టిఫిన్, భోజనం ఖర్చులకు వంద రూపాయలతో పాటు రాత్రి వసతి కూడా ఉంటుందన్నారు. ఆసక్తి గల వారు పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.
News March 23, 2025
ADB: ఇంటివద్దకే సీతారాముల కళ్యాణ తలంబ్రాలు

భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాల బుకింగ్ కోసం ప్రత్యేక కౌంటర్‌ను ఆదిలాబాద్ బస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ ప్రతిమా రెడ్డి తెలిపారు. శనివారం ఆమె కౌంటర్‌ను ప్రారంభించారు. భక్తులు రూ.151 చెల్లించి బుక్ చేసుకుంటే కార్గో సేవల ద్వారా మీ ఇంటి వద్దనే తలంబ్రాలు అందజేస్తామన్నారు.
News March 23, 2025
ADB: కమాండ్ కంట్రోల్స్ సెంటర్‌ను పరిశీలించిన ఎస్పీ

ఆదిలాబాద్ డీఎస్పీ కార్యాలయాన్ని, కమాండ్ కంట్రోల్స్ సెంటర్‌ని ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ డివిజనల్ కార్యాలయంలో విచారణ జరుగుతున్న కేసులపై ఆయన ఆరా తీశారు. పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలన్నారు. కమాండ్ కంట్రోల్స్, సీసీ కెమెరాల తీరును పర్యవేక్షించారు. అంతకుముందు ఎస్పీకి డీఎస్పీ జీవన్ రెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.