News March 10, 2025

ఆదిలాబాద్, నిర్మల్‌కు మొండిచేయి

image

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌కు నిధులు మంజూరు చేస్తూ Dy.CM భట్టి విక్రమార్క ఉత్తర్వులు విడుదల చేశారు. సువిశాల స్థలంలో ఇంటర్నేషనల్ స్థాయి విద్యకు దీటుగా నిర్మిస్తున్నామని తెలిపారు. ఇక్కడి విద్యార్థులు ప్రపంచంతో పోటీపడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్‌కు రూ.200కోట్లు, మంచిర్యాలకు రూ.600 కోట్లు మంజూరుకాగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు ఎలాంటి కేటాయింపులు చేయలేదు.

Similar News

News March 10, 2025

గ్రూప్-1 ఫలితాలు విడుదల

image

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం రిజల్ట్స్ రిలీజ్ చేశారు. అభ్యర్థులు అధికారిక <>వెబ్‌సైట్‌లో <<>>ఫలితాలు తెలుసుకోవచ్చు. 563 పోస్టులకుగానూ గతేడాది జరిగిన మెయిన్స్ పరీక్షలకు 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అటు రేపు గ్రూప్-2 రిజల్ట్స్ రానున్నాయి.

News March 10, 2025

శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షకు 351 మంది గైర్హాజరు

image

శ్రీకాకుళం జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్ పరీక్షకు 351 మంది గైర్హాజరు అయినట్లు జిల్లా ఆర్ఐఓ పీ.దుర్గారావు తెలిపారు. జిల్లాలో జనరల్, ఒకేషనల్ కలిపి 17,523 మందికి గాను 17,171 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదని తెలిపారు. కాగా సోమవారం జరిగిన ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు ఆర్ఐఓ పేర్కొన్నారు.

News March 10, 2025

ప్రజల నుంచి అర్జీలు తీసుకున్న బాపట్ల జేసీ

image

బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమం సోమవారం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ తెలుసుకున్నారు. వారి నుంచి అర్జీలు స్వీకరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని బాధితులకు సంయుక్త కలెక్టర్ హామీ ఇచ్చారు.

error: Content is protected !!