News April 18, 2024

ఆదిలాబాద్: నేటి నుంచే షురూ

image

పార్లమెంట్‌ ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమైంది. ఏడు శాసనసభ స్థానాలతో విస్తరించిన ADB పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ఫిబ్రవరి 8న విడుదల ఓటరు జాబితా ప్రకారం మొత్తం 16,44,715 మంది ఓటర్లున్నారు. ఇందులో 2,57,248 మంది ఓటర్లతో నిర్మల్‌ మొదటిస్థానంలో ఉంటే 2,10,915 ఓటర్లతో బోథ్‌ నియోజకవర్గం చివరిస్థానంలో ఉంది. ADB కలెక్టరేట్‌ ఆవరణలో నేటి నుంచి ప్రారంభం కానున్న నామపత్రాల స్వీకరణ ఈ నెల 25తో ముగియనుంది.

Similar News

News January 11, 2025

జైపూర్: సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి బెస్ట్ అవార్డు

image

జైపూర్ మండలంలోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం అవార్డును అందుకుంది. శుక్రవారం న్యూదిల్లీలో జరిగిన 3వ జాతీయ పవర్ జనరేషన్ వాటర్ మేనేజ్మెంట్ అవార్డ్స్-2025 కార్యక్రమంలో బెస్ట్ వాటర్ ఎఫిషియెంట్ అవార్డు లభించింది. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం అత్యల్పంగా నీటిని వినియోగించినందుకు అవార్డును అందుకున్నట్లు అధికారి D.పంతుల తెలిపారు.

News January 11, 2025

నాగోబా జాతరకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

image

నాగోబా జాతరకు సీఎం రేవంత్ రెడ్డిని మెస్రం వంశీయులు శుక్రవారం ఆహ్వానించారు. రాష్ట్రంలోనే రెండవ గిరిజన జాతరగా పేరుగాంచిన ఆదివాసీల ఆరాధ్యదైవం, మెస్రం వంశీయులతో పూజింపబడే కేస్లాపూర్‌కు జాతరకు రావాలన్నారు. మెస్రం వెంకటరావు పటేల్, మెస్రం మనోహర్ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో సీఎంను కలిసి ఆహ్వానపత్రికను అందజేశారు.

News January 11, 2025

ADB: ఘనంగా ముగిసిన పోలీస్ స్పోర్ట్స్ మీట్

image

ఆదిలాబాద్ పట్టణంలోని ఏఆర్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన పోలీస్ స్పోర్ట్స్ మీట్ శుక్రవారం ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా క్రీడల్లో రాణించి విజేతలుగా నిలిచిన వారిని ఎస్పీ గౌస్ ఆలం అభినందించి, పతకాలను అందజేశారు. పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొనడం అభినందనీయం అన్నారు. ఏఎస్పీ కాజల్, సురేందర్, డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు తదితరులున్నారు.