News June 3, 2024

ఆదిలాబాద్: నేడు POLYCET ఫలితాలు

image

పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల కోసం మే 24న పాలిసెట్ పరీక్ష నిర్వహించారు. కాగా ఆ పరీక్షకు సంబంధించిన ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,059 విద్యార్థులు ఉండగా బాలురు 531, బాలికలు 408, మొత్తం 939 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులు, ర్యాంకు ఆధారంగా వివిధ పాలిటెక్నిక్ కళాశాలలు, కోర్సులలో అడ్మిషన్స్ జరుగుతాయి.

Similar News

News October 1, 2024

ADB: డీఎస్సీ ఫలితాల్లో 1వ ర్యాంకు సాధించిన పూర్ణచందర్ రెడ్డి

image

తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలలో అదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సోనాల గ్రామానికి చెందిన నీగ పూర్ణ చందర్ రెడ్డి జిల్లాలోనే మెుదటి ర్యాంకు సాధించాడు. దీంతో ఆయన తల్లిదండ్రులతో పాటు ప్రోత్సహించి గ్రామస్థులు అభినందించారు. మండలానికి చెంది ఉపాధ్యాయులు ఆయనను ఘనంగా సన్మానించారు.

News October 1, 2024

రైతుల రుణాలను మాఫీ చేయాలి: ఎంపీ నగేశ్

image

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణాలు మాఫీ చేస్తామని, 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రజలను మభ్యపెట్టి అధికారంలో వచ్చి రైతులకు న్యాయం చేయలేదని ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన రైతు ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రుణమాఫీ కాని రైతుల రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

News September 30, 2024

ADB: రేపు అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం

image

ఆదిలాబాద్ జెడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం మహిళ, శిశు, వికలాంగుల, వయోవృద్దుల సంక్షేమ శాఖ, తెలంగాణ వయోవృద్ధుల సమాఖ్య, ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి సబిత పేర్కొన్నారు. వయోవృద్ధులు అధిక సంఖ్యలో హాజరుకావాలని పేర్కొన్నారు. అలాగే ఉచిత వైద్య శిబిరం నిర్వహించుచున్నట్లు తెలిపారు.