News March 26, 2025
ఆదిలాబాద్: పరీక్షకు 24 మంది విద్యార్థులు గైర్హాజరు

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. బుధవారం నిర్వహించిన పరీక్షకు మొత్తం 10,050 మంది విద్యార్థులకు గాను 10,026 మంది విద్యార్థులు హాజరుకాగా 24 మంది గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 52 పరీక్ష కేంద్రాలకు గాను 28 పరీక్ష కేంద్రాలను అధికారులు సందర్శించారు.
Similar News
News April 1, 2025
ADB: ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ

ఆదిలాబాద్ కేంద్రీయ విద్యాలయ ఖాళీ సీట్లలో ప్రవేశానికి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లో ఆహ్వానిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ అశోక్ తెలిపారు. రెండో తరగతి నుంచి 8వ తరగతుల్లో ఖాళీ సీట్లు ఉన్నాయన్నారు. తాత్కాలిక ఖాళీల జాబితా, అర్హత ప్రమాణాలు, రిజిస్ట్రేషన్ షెడ్యూల్ మొదలైన వాటికోసం వెబ్ సైట్ https://adilabad.kvs.ac.in/ సందర్శించాలని లేదా విద్యాలయాన్ని సందర్శించాలని కోరారు.
News April 1, 2025
ADB: ఏప్రిల్ 14 వరకు గడువు పొడిగింపు

రాజీవ్ యువ వికాస్ స్వయం ఉపాధి పథకాలకు ప్రభుత్వ ఏప్రిల్ 5 వరకు అవకాశం కేంద్రం కాగా యువత కొరిక మేరకు దరఖాస్తు గడువును ఏప్రిల్ 14 వరకు పొడిగించినట్లు ADB కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. దరఖాస్తులను ప్రజాపాలన సేవా కేంద్రం, మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల్లో అందచేయాలన్నారు. మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకునేవారు అదనపు చార్జీలు చెల్లించనవసరం లేదని కోరారు చేశారు.
News March 31, 2025
ఆదిలాబాద్: 13వ రోజుకు చేరుకున్న దీక్ష

ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్ష 13వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు పలు యువజన నాయకులు, వివిధ సంఘాల నేతలు మద్దతు తెలిపారు. సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి సీసీఐ పునరుద్ధరణకు కృషి చేయాలని కోరారు.