News December 18, 2024
ఆదిలాబాద్: యువకుడిపై పోక్సో కేసు నమోదు
బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై మంగళవారం పోక్సో కేసు నమోదు చేసినట్లు ADB వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. స్థానిక శాంతినగర్‌కు చెందిన ఆసిఫ్ (23) పాఠశాలకు వెళ్తున్న 9వ తరగతి చదువుతున్న బాలిక పట్ల అసభ్యకరంగా కామెంట్లు చేస్తూ వేధింపులకు గురి చేశాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు వన్ టౌన్లో ఫిర్యాదు చేశారు. యువకుడిని అరెస్టు చేసి పోక్సో కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News February 5, 2025
ఆదిలాబాద్: 35 మందిలో ఆరుగురు ఎంపిక
ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో బుధవారం TSKC, TASK ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు స్పందన లభించింది. ఈ జాబ్ మేళాలో హెచ్.ఈ.టీ.ఈ.ఆర్.ఓ లాబొరేటరీస్, ఫార్మాస్యూటికల్ ప్రొడక్షన్లో పోస్టులకు 35 మంది అభ్యర్థులు హాజరవ్వగా ఆరుగురు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.సంగీత తెలిపారు. విద్యార్థులు తమకు నచ్చిన రంగంలో నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగాలన్నారు.
News February 5, 2025
ADB: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
ఆదిలాబాద్‌లో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. లాండసాంగి గ్రామ సమీపంలోని రహదారిపై మహారాష్ట్ర పాటన్ బోరికి చెందిన షాలిక్‌కు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వెంటనే అతడిని 108లో ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
News February 5, 2025
గుడిహత్నూర్‌లో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
గుడిహత్నూర్ మండలంలోని సీతాగొంది వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కమలాపూర్ గ్రామానికి చెందిన భౌరే చిన్న గంగాధర్ (60) బైక్ పై ఆదిలాబాద్ వెళ్తున్నాడు. ఈ క్రమంలో సీతాగొంది సమీపంలో ఉన్న హైమద్ ధాబా నుంచి యు టర్న్ తీసుకుంటుండగా ఓ కారు వచ్చి ఢీకొంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందినట్లు వెల్లడించారు.