News January 16, 2025
ఆదిలాబాద్: రైతు భరోసా సర్వేకు 102 బృందాలు
ADB జిల్లా రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా లక్షా 62వేల పట్టా పాసు పుస్తకాలు ఉండగా ఆ డేటా ఆధారంగానే అధికారులు వెరిఫికేషన్ చేయనున్నారు. 102 క్లస్టర్లలో సర్వేకు 102 అధికార బృందాలు సిద్ధమయ్యాయి. ఇందులో వ్యవసాయ, రెవెన్యూ, పంచాయతీ రాజ్ అధికారులు పాల్గొంటారు. గతంలో సాగు అనువుకాని భూమికి సైతం రైతుబంధు ఇచ్చారనే ఆరోపణల నేపథ్యంలో పకడ్బందీగా సర్వే చేయనున్నట్లు వారు చెబుతున్నారు.
Similar News
News January 28, 2025
ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధరల వివరాలు
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో మంగళవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,950గా నిర్ణయించారు. సోమవారం ధరతో పోలిస్తే మంగళవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పులేదు. ప్రైవేట్ పత్తి ధర రూ.110తగ్గినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.
News January 28, 2025
ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా: ఖానాపూర్ ఎమ్మెల్యే
ఉమ్మడి జిల్లాకు అత్యధికంగా నిధులను మంజూరు చేయించి అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. సోమవారం సిరికొండ మండలంలోని వాయిపెట్ గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న వాలీబాల్ పోటీలను తిలకించి, ఆటను ఆడారు. మాజీ ఎంపీ సోయం బాపురావు ఉన్నారు.
News January 27, 2025
ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధరల వివరాలు
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో సోమవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.7,060గా నిర్ణయించారు. శనివారం ధరతో పోలిస్తే సోమవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పులేదు. ప్రైవేట్ పత్తి ధర రూ.10 పెరిగినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.