News April 8, 2025
ఆదిలాబాద్: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని KRK కాలనీలో వ్యభిచార గృహంపై పోలీసులు సోమవారం దాడి చేశారు. భాగ్యలక్ష్మి, గంగన్న అనే ఇద్దరు.. అమాయక మహిళలు, యువతులకు డబ్బు ఆశ చూపుతూ వ్యభిచారం చేయిస్తున్నట్లు ఎస్ఐ విష్ణువర్ధన్ తెలిపారు. ఇద్దరు బాధిత మహిళలను అదుపులోకి తీసుకొని సఖి కేంద్రానికి తరలించి ఆశ్రయం కల్పించామన్నారు. నిందితులైన భాగ్యలక్ష్మి, గంగన్నతో పాటు విటులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.
Similar News
News April 19, 2025
ADB: మహిళ కడుపులో 3.5కిలోల గడ్డ.. అరుదైన చికిత్స

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ గ్రామానికి ఓ మహిళ కడుపులో నుంచి ముడున్నర కిలోల ఫైబ్రాయిడ్ గడ్డను వైద్యులు తొలగించారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం అరుదైన ఆపరేషన్ చేసినట్లు డాక్టర్ హేమరాజ్ సింగ్ తెలిపారు. మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపారు. మహిళ కుటుంబీకులు వైద్యులకు ధన్యవాదాలు చెప్పారు.
News April 19, 2025
ADB: అమ్మాయిని వేధించాడు.. అరెస్టయ్యాడు

సోషల్ మీడియా ద్వారా బోథ్ పట్టణానికి చెందిన ఒక అమ్మాయిని వేధించిన కేసులో నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తికి చెందిన అలీమ్ బేగ్ అనే వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేసినట్లు SI ప్రవీణ్‌కుమార్ తెలిపారు. అతడిని రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు. నిందితుడిపై రెంజల్ పోలీస్ స్టేషన్‌లో ఇదివరకే నాలుగు కేసులు, రౌడీ షీట్ ఉన్నాయని తెలిపారు.
News April 19, 2025
ADB: ఈ నెల 20న MJP బ్యాక్ లాగ్ సెట్

ఉమ్మడి జిల్లాలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బాలుర, బాలికల గురుకులాల్లోని 6,7,8,9 వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు RCO శ్రీధర్ తెలిపారు. ఎంజేపీ బ్యాక్‌లాగ్ సెట్ ఈ నెల 20న ఉంటుందన్నారు. ఉమ్మడి జిల్లాలో 12 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 3,308 విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 10 నుంచి పరీక్ష ప్రారంభమవుతుందని, గంట ముందే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవాలన్నారు.