News April 8, 2025
ఆదిలాబాద్‌లో 12 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం

12ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆదిలాబాద్‌లో వెలుగుచూసింది. DSP జీవన్ రెడ్డి తెలిపిన వివరాలు.. మావల పరిధిలోని ఓ కాలనీకి చెందిన బాలికను ఓ 35ఏళ్ల మహిళ ఆదివారం మధ్యాహ్నం అడవిలోకి తీసుకెళ్లింది. ఆమె బంధువుతో కలిసి అక్కడకు వచ్చిన ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారం చేశారు. బాలిక తల్లికి విషయం చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువకులతో పాటు మహిళ, ఆమె బంధువుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Similar News
News April 17, 2025
నేటి నుంచి ‘భూభారతి’ రెవెన్యూ సదస్సులు

TG: ‘భూభారతి’ పైలెట్ ప్రాజెక్ట్‌కు ఎంపిక చేసిన 4 మండలాల్లో నేటి నుంచి రెవెన్యూ సదస్సులు జరగనున్నాయి. అక్కడ రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారులు దరఖాస్తులు స్వీకరించి, వాటిని పోర్టల్ ద్వారా పరిష్కరిస్తారు. అందులో పరిష్కారం కాకున్నా, పోర్టల్ పని చేయకపోయినా రాష్ట్రస్థాయిలో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. ఈ సదస్సులను మంత్రి పొంగులేటి ఇవాళ నారాయణపేట జిల్లా మద్దూరులో ప్రారంభించనున్నారు.
News April 17, 2025
ఆస్తికోసం తమ్ముడిపై అన్న కత్తితో దాడి

ఆస్తిలో వాటా అడిగిన తమ్ముడి కళ్లలో కారం చల్లి అన్న కత్తితో దాడికి పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పెద్దమండ్యం మండలానికి చెందిన సుధాకర్ రెడ్డికి తన అన్న వెంకటరమణారెడ్డికి మధ్య ఆస్తి వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం సుధాకర్ రెడ్డి అన్నను ఆస్తిలో వాటా పంచాలని పొలం దగ్గర నిలదీశాడు. దీంతో ఆగ్రహించిన వెంకటరమణారెడ్డి తమ్ముడి కళ్లలో కారం చల్లి కత్తి దాడిచేశాడు.
News April 17, 2025
శంఖవరం: చెప్పులు దండ వేసిన నిందితుడు అరెస్ట్

శంఖవరంలో అంబేడ్కర్ విగ్రహానికి అపచారం చేసిన వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం కోర్టులో హాజరు పరుస్తామని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు.నిందితుడి పేరు పడాల వాసు(20) అని అతను ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని డీఎస్పీ వెల్లడించారు. డీఎస్పీ ఆధ్వర్యంలో నలుగురు సీఐలు,10మంది ఎస్సైలు ,40 మంది సిబ్బంది సాంకేతికతతో అతన్ని పట్టుకున్నామని ఎస్పీ వారిని అభినందించారు.