News April 8, 2025
ఆదిలాబాద్‌లో 12ఏళ్ల బాలికపై అత్యాచారం

12ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆదిలాబాద్‌లో వెలుగుచూసింది. DSP జీవన్ రెడ్డి తెలిపిన వివరాలు.. మావల పరిధిలోని ఓ కాలనీకి చెందిన బాలికను ఓ 35ఏళ్ల మహిళ ఆదివారం మధ్యాహ్నం అడవిలోకి తీసుకెళ్లింది. ఆమె బంధువుతో కలిసి అక్కడకు వచ్చిన ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారం చేశారు. బాలిక తల్లికి విషయం చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువకులతో పాటు మహిళ, ఆమె బంధువుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Similar News
News April 17, 2025
ADB: యువతికు వేధింపులు.. రహీం ARREST

మహిళల, విద్యార్థుల రక్షణకు షీటీం నిత్యం అందుబాటులో ఉంటుందని షీటీం ఇన్‌ఛార్జ్ ఏఎస్ఐ సునీత తెలిపారు. ADBకు చెందిన యువతిని HYDలో చార్మినార్ వద్ద దుస్తుల దుకాణంలో దిగిన ఫొటోను అక్కడ పనిచేస్తున్న షేక్ రహీం మార్పింగ్ చేశాడు. దానిని ఆధారం చేసుకొని సోషల్ మీడియాలో ఆమెపై దుష్ప్రచారం చేస్తూ వేధించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని స్పెషల్ ఆపరేషన్ ద్వారా ADBకు రప్పించి అరెస్టు చేసినట్లు ASI తెలిపారు.
News April 17, 2025
నేరడిగొండ: గంజాయి కేసులో ఇద్దరు ARREST

నేడిగొండ మండలంలో గంజాయి పట్టుబడ్డ కేసులో ఇద్దరిని రిమాండ్‌కు తరలించినట్టు సీఐ భీమేశ్ తెలిపారు. నేరడిగొండకు చెందిన బత్తుల కిరణ్(20) గంజాయితో ఉన్నారన్న సమాచారం మేరకు ఎస్సై శ్రీకాంత్‌తో కలిసి సోదాలు నిర్వహించగా పట్టుబడ్డారన్నారు. బత్తుల కిరణ్ విచారించగా ధాంస తండాకు చెందిన పెందూర్ లచ్చు వద్ద కొనుగోలు చేసినట్లు తెలిపారు. రూ.11,250 విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
News April 17, 2025
ఈనెల 18న ADBకు మంత్రి పొంగులేటి రాక

భోరజ్ మండలం పూసాయిలో ఈనెల 18న ఏర్పాటు చేయనున్న భూ భారతి రెవెన్యు సదస్సులో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొంటారని కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. బుధవారం గ్రామంలో ఏర్పాట్లను పరిశీలించారు. ప్రభుత్వం ధరణి స్థానంలో భూ భారతి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సందర్భంగా మంత్రిచే ప్రారంభించే సదస్సుకు ఏర్పాట్లు పూర్తిచేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.