News December 13, 2024

ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధరల వివరాలు

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో శుక్రవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,521గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,960గా నిర్ణయించారు. గురువారం ధరతో పోలిస్తే శుక్రవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పులేదు. ప్రైవేట్ పత్తి ధర రూ.20 పెరిగినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.

Similar News

News December 27, 2024

ఆదిలాబాద్‌: కేయూ పరిధిలో పరీక్షలు వాయిదా

image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దృష్ట్యా కాకతీయ యూనివర్సిటీ యూనివర్సిటీ పరిధిలో నేడు జరగాల్సిన పరీక్షలకు వాయిదా వేస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. నేడు ఉదయం జరగాల్సిన డిగ్రీ 5వ సెమిస్టర్ పరీక్ష, మధ్యాహ్నం జరగాల్సిన 1వ సెమిస్టర్ పరీక్ష వాయిదా వేశారు. ఈ పరీక్షలు డిసెంబర్ 31 మంగళవారం జరుగుతాయని స్పష్టం చేశారు. కావున ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

News December 27, 2024

మంచిర్యాల: సిగ్నల్స్ రావాలంటే చెట్టెక్కాల్సిందే.!

image

ప్రస్తుత కాలంలో సెల్‌ఫోన్ లేని వారంటూ ఉండరు. సాంకేతికత చాలా విస్తరించినప్పటికీ కొన్ని గ్రామాల్లో సెల్‌ఫోన్లకు సిగ్నల్స్ రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం జోగాపూర్ గ్రామంలో టెలిఫోన్ సిగ్నల్ లేక గ్రామస్థులు ఎవరికైనా ఫోన్ చేయాల్సి వస్తే చెట్లు, గోడలు, బిల్డింగులు ఎక్కుతున్నారు. బంధువులు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ లేదా నెట్వర్క్ ఏరియాలో లేదు అని వస్తుందని వాపోతున్నారు.

News December 27, 2024

సిర్పూర్ (టి): ‘అడవుల సంరక్షణ అందరి బాధ్యత’

image

అటవీ సంరక్షణ అభివృద్ధిలో ఉద్యోగులతో పాటు ప్రజలు భాగస్వాములు కావాలని కంపా పిసిసిఎఫ్ సువర్ణ అన్నారు. సిర్పూర్ టి రేంజ్ పరిధిలోని ఇటుకల పహాడ్ గ్రామాన్ని సిఎఫ్ శాంతారాం, డిఎఫ్ఓ నీరజ్ కుమార్‌తో కలిసి సందర్శించి అక్కడ కంపా నిధులతో చేసిన ప్లాంటేషన్ పరిశీలించి అనంతరం గ్రామస్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్లాంటేషన్ పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. అడవుల సంరక్షణ అందరి బాధ్యత అని అన్నారు.