News January 27, 2025

ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధరల వివరాలు

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో సోమవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.7,060గా నిర్ణయించారు. శనివారం ధరతో పోలిస్తే సోమవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పులేదు. ప్రైవేట్ పత్తి ధర రూ.10 పెరిగినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.

Similar News

News February 14, 2025

ADB: ‘కేంద్రమంత్రి అశ్విన్ కుమార్‌ను కలిసిన ఎంపీ నగేశ్’

image

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని కుమార్‌ను ఎంపీ నగేశ్ ఢిల్లీలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్మూర్ నుంచి ADB వరకు వయా నిర్మల్ రైల్వేలైన్, నాందేడ్ నుంచి కొన్ని రైళ్లను ADB వరకు పొడిగించాలని కోరారు. భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ను సిర్పూర్(టి) వరకు పొడిగించాలని, కాజీపేట నుంచి హౌరాకు పెద్దపల్లి, మంచిర్యాల, కాగజ్‌నగర్ మీదుగా కొత్త రైలు వేయాలని కోరగా.. సానుకూలంగా స్పందించినట్లు నగేశ్ పేర్కొన్నారు.

News February 14, 2025

ADB: MH మద్యం స్వాధీనం.. ఒకరి ARREST

image

జైనథ్, భోరజ్ మండలాల్లోని పలు గ్రామాల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు గురువారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా పార్డి (బి)లో అక్రమంగా దేశీదారు అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 46 దేశీదారు బాటిల్లు, టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ విజేందర్ తెలిపారు. అక్రమంగా దేశీదారు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News February 14, 2025

బాసర అమ్మవారి ఆలయం ఆదాయం రూ.1,08,25,110

image

బాసర సరస్వతి అమ్మవారి హుండీకానుకలను ఆలయ అధికారులు గురువారం లెక్కింపు చేపట్టారు. రూ.1,08,25,110 నగదు, మిశ్రమ బంగారం 78 గ్రాములు, మిశ్రమ వెండి 4.800 కిలోలతో వివిధ దేశాలకు చెందిన కరెన్సీలు 36 నోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఆదాయం మొత్తం దేవస్థానానికి 79 రోజుల్లో సమకూరినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!