News April 23, 2025
ఆదోని మార్కెట్‌లో మళ్లీ పెరిగిన పత్తి ధరలు.!

కర్నూలు జిల్లాలో ఆదోని మార్కెట్‌లో పత్తి ధర నిన్నటితో పోలీస్తే క్వింటాకు రూ.150 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో దూది గింజల ధర స్వల్పంగా పెరగడం, పత్తి జిన్నింగ్ ప్రెస్సింగ్ పరిశ్రమల ఉత్పత్తికి అవసరమైన పత్తి మార్కెట్‌కి రాకపోవడంతో ధరలు పెరిగాయి. ఆదోని మార్కెట్‌లో మంగళవారం పత్తి క్వింటాల్ ధర గరిష్ఠంగా రూ.8,254 గా ఉంది. కనిష్ఠ ధర రూ.5,209 ఉండగా, మధ్యస్థ ధర రూ.7,639కి పెరిగింది.
Similar News
News April 23, 2025
పహల్‌గామ్ దాడి.. ప్రభాస్ హీరోయిన్‌పై నెటిజన్ల ఫైర్

పహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రభాస్ ‘ఫౌజీ’లో హీరోయిన్ ఇమాన్విపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆమె పాక్‌కు చెందినవారని, ‘ఫౌజీ’ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏ ఒక్క పాకిస్థానీ కూడా IND మూవీస్‌లో నటించకూడదంటున్నారు. అటు ఉగ్రదాడికి, ఆమెను ముడిపెట్టడం ఏంటని మరికొందరు అంటున్నారు. కరాచీకి చెందిన ఇమాన్వి కుటుంబం ప్రస్తుతం USలో నివసిస్తోంది. ఆమె తండ్రి ఇక్బాల్ పాక్ మాజీ మిలటరీ అధికారి.
News April 23, 2025
కాసేపట్లో వర్షం

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొద్దిసేపట్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సంగారెడ్డి, జగిత్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అరగంటలో వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేశారు. అటు ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోనూ కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షం పడటానికి అవకాశం ఉందని తెలిపారు. మీ ప్రాంతంలో వర్షం కురుస్తోందా?
News April 23, 2025
ఆ కేసును కొట్టేయండి.. కోర్టులో సీఎం రేవంత్ పిటిషన్

TG: తనపై నమోదైన పరువు నష్టం కేసును కొట్టేయాలంటూ CM రేవంత్ రెడ్డి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ వేశారు. BJP మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ ఎన్నికల ప్రచారంలో రేవంత్ చెప్పారని ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసు విచారణ చేపట్టొద్దని, కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని రేవంత్ కోరారు. దీనిపై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.